ప్రమాదకరంగా పశ్చిమ బెంగాల్‌ రవాణా | West Bengal: People Availing Public Buses At Risk As Sanitisation | Sakshi
Sakshi News home page

కరోనా: బస్సులు శానిటైజ్‌ చేయడం లేదు

Published Wed, Jul 22 2020 2:47 PM | Last Updated on Wed, Jul 22 2020 3:40 PM

West Bengal: People Availing Public Buses At Risk As Sanitisation - Sakshi

కోల్‌కతా: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తూ దేశంలో ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ ఇంకా కొన్ని రాష్ట్రల్లో ప్రజా రవాణా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో బస్సులను శానిటైజ్‌ చేయడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బస్సు మొదలైనప్పుడు తప్ప మరెక్కడ బస్సును శానీటైజ్‌  చేయడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. పశ్చిమ మిడ్నపూర్‌లో జిల్లా మేజిస్టేట్‌ బస్సులను శానిటైజ్‌ చేయాలని ఆదేశించినప్పటికీ బస్సు యజమానులు ఖాతరు చేయడం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బెంగాల్‌ లోని పలు ప్రాంతాల్లో డ్రైవర్లకు, కండక్టర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. (చదవండి: కరోనా మృతులకు 10 లక్షలు.. ఉద్యోగం)

దీంతో మిగిలిన వారు కూడా విధులకు రావడానికి సంకోచిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో బస్సులు ఆగిపోయాయి. కరోనా పాజిటివ్‌ సోకిన ఒక కండక్టర్‌ 30 మంది ఇతర సిబ్బందితో కలిసి ఉండటం కలకలం రేపింది. ఈ విషయం గురించి ప్రైవేట్‌ బస్సు యజమానులు మాట్లాడుతూ.. బస్సుకు 20 మందినే అనుమతించడం వల్ల తమకు చాలా నష్టం వస్తుందని, ఇక శానిటైజర్లు వాడటం, బస్సులను శానిటైజ్‌ చేయించడం అంటే తమ వల్ల కాదని చెప్పారు. ఈ విషయంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ సిన్హా స్పందిస్తూ.. ‘బెంగాల్‌లో బస్సు సదుపాయాలను కల్పిస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ సిబ్బందికి ఇప్పటి వరకు సరైన మాస్క్‌లు, గ్లౌజ్‌లు కూడా ఇవ్వలేదు’ అని ఆయన ఆరోపించారు. (చదవండి: కరోనా కట్టడికే ఆన్‌లైన్‌ ప్రజావాణి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement