
నందనవనంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కార్పొరేటర్ సుజాతనాయక్
హస్తినాపురం: డివిజన్‌లోని కాలనీల ప్రధాన రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే సహించేది లేదని కార్పొరేటర్ బానోతు సుజాతానాయక్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని నందనవనం కాలనీలో పారిశుద్ధ్య సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కార్పొరేటర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డివిజన్‌లోని అన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించేలా అధికారులు తరచూ పరిశీలించాలన్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ గణేశ్, జవాన్ శంకర్, నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి , మల్లేశ్‌గౌడ్ , రాజుగౌడ్, మారం శ్రీధర్ పాల్గొన్నారు.