Littering
-
New Rules In Goa: గోవాలో ఈ పనులు చేస్తే భారీగా జరిమానా
పనాజీ: గోవా వెళ్లి స్నేహితులతో పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఈ కొత్త నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. గోవాలో పర్యటకాన్ని మరింత బలోపేతం చేసే దిశగా, టూరిస్టు ప్రాంతాలు పరిశుభ్రంగా, సురక్షితంగా ఉండేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. ఆయా నిబంధనలను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు అక్టోబర్ 31వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఓ వ్యక్తి, కంపెనీ, సంఘం, సంస్థ ఏదైనా నిబంధనలు ఉల్లఘిస్తే రూ.5000 జరిమానా విధిస్తాం. ఆ ఫైన్ రూ.50,000 వరకు సైతం ఉండవచ్చు. ఐపీసీలోని సెక్షన్ 188 ప్రకారం చర్యలు ఉంటాయి.’ అని గవర్నమెంట్ ఆర్డర్లో పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం బీచ్‌లోని బహిరంగ ప్రదేశాల్లో వంట చేయటం, డ్రైవింగ్ వంటివి నిషేదం. బీచ్‌లో చెత్త పారవేయటం, మద్యం బాటిళ్లను పగలగొడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. కొద్ద నిబంధనలు ఇలా.. ► ఇకపై బీచ్‌లో డ్రైవింగ్ చేయకూడదు. బహిరంగ ప్రదేశంలో వంట వండటం నిషేదం. ► బీచ్‌లో చెత్త వేయటం, తాగి పడేసే బాటిళ్లను పగలగొట్టటం నేరం. ► టూరిస్టులతో పాటు వారికి సేవలందిస్తున్న వివిధ సంస్థలు, వ్యాపారస్తులకు సైతం కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ► వాటర్ స్పోర్ట్స్ కేవలం గుర్తింపు పొందిన ప్రాంతాల్లోనే నిర్వహించాలి. ► టికెట్ల జారీ గుర్తింపు పొందిన కౌంటర్ల వద్దే నిర్వహించాలి. బహిరంగంగా టికెట్లు జారీ చేయకూడదు. ► తోపుడి బండిపై వ్యాపారం చేసే వారు పర్యటకులకు అడ్డుపడితే జరిమానా పడుతుంది. ► ఎవరైనా టూరిస్టులను డబ్బులు అడగడం, అల్లర్లు సృష్టించటం చేస్తే చర్యలు తప్పవు. ► నిబంధనలను అతిక్రమించిన వారికి రూ.5వేల నుంచి రూ.50వేల వరకు జరిమానా విధించనున్నారు. ఇదీ చదవండి: పీఎంగా రిషి సునాక్ తొలిసారి బిగ్ యూ-టర్న్.. ఆ నిర్ణయంలో మార్పు -
బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే సహించం
హస్తినాపురం: డివిజన్లోని కాలనీల ప్రధాన రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే సహించేది లేదని కార్పొరేటర్ బానోతు సుజాతానాయక్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని నందనవనం కాలనీలో పారిశుద్ధ్య సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కార్పొరేటర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డివిజన్లోని అన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించేలా అధికారులు తరచూ పరిశీలించాలన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ గణేశ్, జవాన్ శంకర్, నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి , మల్లేశ్‌గౌడ్ , రాజుగౌడ్, మారం శ్రీధర్ పాల్గొన్నారు. -
పెద్దింట పెళ్లిళ్లు.. చెత్తకు రూ. 2.5 లక్షల ఫైన్
డెహ్రాడూన్: దక్షిణాఫ్రికాకు చెందిన గుప్తా కుటుంబానికి ఉత్తరాఖండ్‌లోని జోషిమత్ మున్సిపాలిటీ రూ. 2.5 లక్షల జరిమానా విధించింది. పెళ్లి తర్వాత మిగిలిన చెత్తను ఖాళీగా ఉన్న చోట పడేయడంతో జరిమానా విధించినట్లు జోషిమత్ మున్సిపాలిటీ అధికారి సత్యపాల్ నౌతియాల్ తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని ఔలి స్కి రిసార్ట్‌లో జూన్ 20, 22న జరిగిన వారి ఇద్దరి కుమారుల పెళ్లిళ్లలో 321 క్వింటాళ్ల చెత్త పోగయింది. ఆ చెత్తను అలాగే వదిలేసినందుకు రూ. 1.5 లక్షలు, ఖాళీ స్థలంలో వేసినందుకు మరో లక్ష జరిమానా విధించింది. ఈ పెళ్లిళ్లకు రూ. 200 కోట్లు ఖర్చు చేశారు. పెళ్లిళ్ల అనంతరం చెత్తను తొలగించేందుకుగాను ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి రూ. 8.14 లక్షల బిల్లును పంపినట్లు అధికారులు తెలిపారు. యూజర్ చార్జీలు రూ. 54 వేలతో కలిపి మున్సిపాలిటీకి ముందుగానే రూ. 5.54 లక్షలను గుప్తా సోదరులు డిపాజిట్ చేయడం విశేషం. -
విజృంభిస్తున్న డెంగీ
- బాధితులతో కిటకిటలాడుతున్న విమ్స్ - బళ్లారి, రాయచూరు, కొప్పళ వాసులే అధికం బళ్లారి (తోరణగల్లు) : అప్పుడప్పుడు కురుస్తున్న వానలకు తోడు మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, అపరిశుభ్రతల నుంచి దోమలు కుప్పతెప్పలుగా ఉత్పత్తవుతున్నాయి. ఎక్కువ కాలం నిల్వ ఉన్న మూతలులేని నీటితొట్టెలు, డ్రమ్ములు, టైర్లు, టెంకల్లో నుంచి డెంగ్యూ బారిన పడేసే దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఈ దోమకాటుకు గురైనవారు జ్వరంతో మంచాన పడుతున్నారు. ఈ జ్వరమే డెంగీగా మారి ఆసుపత్రి పాలు చేస్తున్నాయి. విమ్స్‌లో చిల్డ్రన్స్ వార్డులో బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాలకు చెందిన వివిధ ప్రాంతవాసులు, చిన్నారులు చికిత్స పొందుతున్నారు. గత వారం తీవ్ర డెంగీతో మృత్యువాత పడిన మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఆసుపత్రిలో వార్డులు డెంగీ బాధితులతో నిండుతున్నాయి. విమ్స్ పాలక మండలి డెంగీ బాధితుల కోసం కొత్తగా రెండు వార్డులను ఏర్పాటు చేశారు. పెరుగుతున్న డెంగీ బాధితులతో వార్డుల్లో పడకల కొరత ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం, ఆరోగ్య శాఖ, సిటీ కార్పొరేషన్ చర్యలు చేపట్టి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి డెంగీని నివారించాలని ప్రజలు కోరుతున్నారు. -
చెత్తమయం
కనీస వేతనాల అమలు కోసం మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె గురువారంతో నాలుగు రోజులు పూర్తయింది. చాలీచాలని వేతనాలతో ఇల్లు గడవడం కష్టంగా మారుతోందని, పెరుగుతున్న జీవన వ్యయూలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కార్మికులు సమ్మెబాట పట్టారు. పారిశుధ్య కార్మికుల సమ్మెతో మున్సిపాలిటీల్లోని గల్లీలన్నీ చెత్తమయంగా మారుతున్నాయి. రోజురోజుకు చెత్తకుప్పలు పెరుగుతుండడంతో పట్టణ ప్రజలు ఈగలు, దోమలు, దుర్వాసన మధ్య జీవితం గడుపుతున్నారు. - కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె - సమ్మెతో స్తంభించిన పారిశుధ్య నిర్వహణ - వీధుల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం - ఈగలు, దోమలు, పందుల స్వైరవిహారం - జిల్లా కేంద్రంలో కనిపించని ప్రభావం - కాంట్రాక్టు సిబ్బంది గోడు పట్టని సర్కారు కరీంనగర్ : జిల్లాలో రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగరపాలక సంస్థలు ఉండగా, కరీంనగర్ కార్పొరేషన్ మినహా మిగతా పది చోట్ల సమ్మె ప్రభావం ఉంది. రామగుండం కార్పొరేషన్‌తో పాటు జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల మున్సిపాలిటీలు, పెద్దపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, వేములవాడ నగర పంచాయతీల్లో మున్సిపల్ కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటున్నారు. రామగుండం కార్పొరేషన్లో 363 మంది, జగిత్యాలలో 292 మంది, సిరిసిల్లలో 125 మంది, కోరుట్లలో 145 మంది, మెట్పల్లిలో 124 మంది, వేములవాడలో 154 మంది, పెద్దపల్లిలో 110 మంది, హుజూరాబాద్‌లో 100 మంది, హుస్నాబాద్‌లో 100 మంది, జమ్మికుంటలో 117 మంది కాంట్రాక్టు కార్మికులు పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొంటుండడంతో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో చెత్తను తీసేందుకు సిబ్బంది లేకపోవడంతో ఆయూ పట్టణాల్లో పారిశుధ్యం పడకేసింది. రోజూ చెత్త తీస్తేనే రోడ్ల వెంట చెత్త కుప్పలు కనిపించే మున్సిపాలిటీల్లో నాలుగు రోజుల సమ్మె ప్రభావం తీవ్రంగా కనబడుతోంది. చెత్తకు తోడు పందులు చేరి నానా హంగామా చేస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త కలెక్షన్ పాయింట్ల సమీపంలో ఉండే నివాసాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెను కొనసాగించడం తప్ప వేరే మార్గం లేదని కార్మిక సంఘ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మికులు కోరుతున్నారు. పర్మినెంట్ కార్మికులు పదుల సంఖ్యలోనే.. చెత్తను తొలగించేందుకు ఆయా మున్సిపాలిటీల్లో పదుల సంఖ్యలో ఉన్న పర్మినెంట్ కార్మికులను ఉపయోగిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులు లేకపోవడంతో పర్మినెంట్ కార్మికులతో చేపట్టే పారిశుధ్య పనులు ఏ మూలనా పూర్తిగా జరగడం లేదు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోడంతో చెత్త తొలగేంచే మార్గమే కనబడకుండా పోతోంది. సమ్మె ఇలాగే కొనసాగితే పేరుకుపోతున్న చెత్తతో అంటువ్యాధులు, విషజ్వరాలు, ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో కనిపించని ప్రభావం కరీంనగర్లో సమ్మె ప్రభావం కనబడడం లేదు. అధికార టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగానికి చెందిన సంఘంలోనే మెజారిటీ కార్మికులు సభ్యులుగా ఉండడంతో విధులకు ఎలాంటి ఆటంకం కలగడం లేదు. నగరపాలక సంస్థలో మొత్తం 747 మంది కార్మికులు పనిచేస్తుండగా, సీఐటీయూలో 70 మంది కార్మికులు మాత్రమే సభ్యులుగా ఉన్నారు. వీరంతా సమ్మెలో పాల్గొంటున్నారు. మిగతా 667 మంది కార్మికులు విధుల్లో ఉండడంతో సమ్మె ప్రభావం మచ్చుకు కూడా కానరావడం లేదు. జిల్లా కేంద్రంలో సమ్మె ప్రభావం లేకపోవడంతో ప్రజాప్రతినిధులు సైతం పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నారు.