పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఢిల్లీలో పారిశుద్ధ్య కార్మికులతో కలసి ఆయన ఆందోళన చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు ఢిల్లీ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు మద్ధతు తెలిపిన రాహుల్ వారితో కలసి రోడ్డుపై బైఠాయించారు. గత మూడు నెలలుగా జీత భత్యాలు చెల్లించడం లేదంటూ చేస్తున్న ధర్నాలో ఆయన దాదాపు గంటపాటు వారితో కూర్చున్నారు.
Published Fri, Jun 12 2015 12:31 PM | Last Updated on Thu, Mar 21 2024 6:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement