
సాక్షి, జనగామ: ‘పరిశుభ్రత పాటించని వారిపై ఫైన్ వేయాలి.. భయం లేక పోతే మార్పు రాదు.. ఇటీవల మా ఊరికి పోయిన.. ఊర్లో తిరిగిన.. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయడంతో మొదట నా మిసెస్‌కే ఫైన్ వేశా.. అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామలో బుధవారం కలెక్టర్ నిఖిల అధ్యక్షతన జరిగిన ‘పల్లె ప్రగతి–పట్టణ ప్రగతి’ప్రజాప్రతినిధుల సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు.
మంత్రుల కంటే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి.. గ్రామాభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సర్పంచ్, ఉప సర్పంచ్‌లపై వారు చర్యలు తీసుకుంటారు.. అధికారులే పని చేయకపోతే సీఎం కేసీఆర్ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు రూ.330 కోట్లను విడుదల చేస్తున్నామన్నారు. నాటే మొక్కల్లో 85 శాతం బతకాలని, లేక పోతే సర్పంచ్‌ల పదవి ఊడిపోతుందని హెచ్చరించారు. j
Comments
Please login to add a commentAdd a comment