పద్మశ్రీ వనజీవి రామయ్యకు ప్రధాని మోదీ లేఖ | PM's letter to Padmashri vanajeevi ramaiah | Sakshi
Sakshi News home page

పద్మశ్రీ వనజీవి రామయ్యకు ప్రధాని మోదీ లేఖ

Published Wed, Sep 20 2017 1:44 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

పద్మశ్రీ వనజీవి రామయ్యకు ప్రధాని మోదీ లేఖ - Sakshi

పద్మశ్రీ వనజీవి రామయ్యకు ప్రధాని మోదీ లేఖ

ఖమ్మం రూరల్‌: స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి సహకరించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ పద్మశ్రీ వనజీవి రామయ్యను కోరారు. ఖమ్మం రూరల్‌ మండలం రెడ్డిపల్లి వాసి వనజీవి రామయ్యకు పీఎంవో నుంచి ప్రధాని సంతకంతో కూడిన లేఖ అందింది. లేఖలో ‘స్వచ్ఛత, పారిశుధ్యం కోసం మహాత్మా గాంధీ ఎంతో పాటుపడ్డారు.

గాంధీ కలలను స్వాప్నికం చేసేందుకు దేశంలోని సామాజిక వేత్తల సహకారం కోరుతున్నాం. అందులో భాగంగానే రామయ్యా జీ.. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి మీ సహకారం చాలా అవసరం. ఆరోగ్యకరమైన భారతావని కోసం కలసికట్టుగా.. సమిష్టిగా పాటుపడదాం. ఇదే మనం మహాత్మా గాంధీకి.. గాంధీ జయంతి రోజున ఇచ్చే కానుక అని’ రాసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement