ఖర్చు బారెడు ఫలితం జానెడు.. | Sanitation dumping yard scam in nellore | Sakshi
Sakshi News home page

ఖర్చు బారెడు ఫలితం జానెడు..

Published Sun, Jul 2 2017 2:32 AM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

ఖర్చు బారెడు ఫలితం జానెడు..

ఖర్చు బారెడు ఫలితం జానెడు..

పారిశుద్ధ్యం పేరుతో చేతివాటం
నగరానికి డంపింగ్‌యార్డు కష్టాలు


నెల్లూరు(పొగతోట): నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలో పారిశుద్ధ్యం మెరుగుకు కోట్లు ఖర్చుచేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండడంలేదు. నగరంలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు దరశనమిస్తున్నాయి. కార్పొరేషన్‌ పరిధిలో సరైన డంపింగ్‌యార్డు అందుబాటులో లేని కారణంగా నిత్యం టన్నుల కొద్ది చెత్త నగరంలో నిలిచిపోతోంది. అంతేకాక డంపింగ్‌యార్డు నగరానికి దూరంగా ఉండడంతో చెత్తను తరలించడంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా నగరంలోని ఆచారివీధి, పొగతోట, వేదా యపాళెం ప్రాంతాల్లో చెత్త కుప్పలు దర్శ నమిస్తున్నాయి. నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంతాలి వద్ద 12 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేశారు. నగరంలో ఉత్పత్తయిన చెత్తను రెండు దశల్లో డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు.

నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలో సుమారు 8 లక్షల మంది నివశిస్తున్నారు. దాదాపు 1.50 లక్షల నివాస గృహాలు ఉన్నాయి. వాటితో పాటు వందల సంఖ్యలో ఆస్పత్రులు, హోటళ్లు ఉన్నాయి. నిత్యం 350 ట న్నులకు పైగా చెత్త ఉత్పత్తి అవుతోంది. కాగా  చెత్తను తరలించేందుకు 20 టి ప్పర్లు, 4 ట్రాక్టర్లు, 54 ఆటోలు, 5 డంపర్లను కార్పొరేషన్‌ అధికారులు వినియోగిస్తున్నారు. 1500 మంది పారిశుద్ధ్య కార్మికులు నిత్యం పని చేస్తున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో ప్రస్తుతం రెండు డంపింగ్‌యార్డులను ఉపయోగిస్తున్నా రు. నగరంలో ఉత్పత్తయిన చెత్తను మొ దట వాహనాల ద్వారా బోడిగాడితోట లోని డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు.

అనంతరం అక్కడి నుంచి దొంతలిలో ఏర్పాటు చేసిన డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. ఇలా రెండు దశల్లో తరలిం చడం వల్ల ఖర్చులు అధికమవుతున్నా యి. వాహనాలకు డీజిల్, కార్మికులకు వేతనాలు తడిసి మోపెడవుతున్నాయి. కాగా చెత్త తరలింపులో అధికారులు చేతి వాటం ప్రదర్శించి నగదు స్వాహా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు పనికి రాకపోయిన వచ్చి నట్లు మస్టర్లు వేసి నగదు మింగేస్తున్నారు. అలాగే వినియోగించని వాహనాల నుంచి డీజిల్‌ డ్రా చేసి బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెత్తను తరలించిన తర్వాత బ్లీచింగ్‌ చేయడంలేదు. ఫలితంగా దోమలు ఉత్పత్తై ప్రజలు రోగాల భారిన పడుతున్నారు. గతంలో ఆల్లీపురం సమీపంలో బైపాసురోడ్డుకు పక్కన డంపింగ్‌యార్డు ఏర్పా టు చేశారు.

దానిని ప్రస్తుతం వినియోగించడంలేదు. అలాగే ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియ సక్రమంగా జరగడంలేదు. అరంభంలో ఆటోల్లో మైకులు పెట్టి ప్రచారం చేసి చెత్త సేకరించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇంటింటా చెత్తను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు గృహాల యాజమానుల నుంచి నెలకు రూ.30 నుంచి 50 వసూలు చేస్తున్నారు. చెత్తను తరలించే వాహనాలు పాతవి కావడంతో వాటిలో వేసిన చెత్త జారీ రోడ్డుపై పడిపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement