- అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. పుష్కరాల నిర్వహణకు రూ.వెయ్యి కోట్లను కేటాయించామని, రహదారులు, పారిశుద్ధ్యం, ఘాట్ల నిర్మాణం, దేవాలయాల జీర్ణోద్ధరణ, భక్తుల వసతి సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లకు వీటిని ఖర్చు చేయాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.