తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ప్రబలుతోంది. రోజురోజుకు డెంగ్యూ బాధితులు పెరిగిపోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో డెంగ్యూ వ్యాధి కారణంగా ఓ వివాహిత మృతి చెందింది.
నాయుడుపేట: తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ప్రబలుతోంది. రోజురోజుకు డెంగ్యూ బాధితులు పెరిగిపోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో డెంగ్యూ వ్యాధి కారణంగా ఓ వివాహిత మృతి చెందింది.
నాయుడుపేట రజక కాలనీకి చెందిన రమణమ్మకు సోమవారం ఉదయం తీవ్రంగా జ్వరం రావడంతో నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని నెల్లూరుకు తరలించారు. అక్కడ ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉందని చెన్నైకి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమెను చెన్నైకి తరలిస్తుండగా అర్ధరాత్రి సమయంలో మృతి చెందింది.