ప్లాస్టిక్ పైపుచుట్ట పడి వ్యక్తి మతి
మినిలారీ నుంచి పైపులు దించుతుండగా చోటుచేసుకున్న ఘటన
నాయుడుపేట : మినీలారీ నుంచి ప్లాస్టిక్ పైపు చుట్ట దించుతూ అది పైనపడి ఓ వ్యక్తి మతిచెందిన ఘటన పట్టణ పరిధిలోని అగ్రహారపేటలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. ప్లాస్టిక్ పైపులు లోడుతో ఉన్న మినీలారీని అగ్రహారపేటలోని టెక్స్మో మోటార్స్ ఏజెన్సీ యజమాని నివాసం వద్ద అన్లోడ్ చేసేందుకు తీసుకొచ్చారు. కూలీలు పైపులు దించుతుండగా సుమారు వెయ్యి కేజీల బరువు కలిగిన పైపు చుట్ట జారి గుమస్తా మన్నారు బాలాజీ (50)పై పడింది. దీంతో అతడి శరీరంలోని అవయావాలు దెబ్బతిని తీవ్ర రక్తస్రావమైయింది. వెంటనే బాధితుడిని పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మతిచెందినట్లు నిర్ధారించారు. ఆస్పత్రికి చేరుకున్న మతుడి భార్య రాధమ్మ, కుమారులు రాజేష్, చరణ్‌లతో పాటు బంధువులు, ఏజెన్సీ నిర్వాహకులు బోరున విలపించారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న బాలాజీ చనిపోవడంతో ఆ కుటుంబం వీధిన పడటై్టంది. పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు.