
రంగారెడ్డి జిల్లాలో విజృంభిస్తున్న డెంగీ
రంగారెడ్డి జిల్లాలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. ఇప్పటికే జిల్లాలోని రాజేంద్రనగర్ సహా ఇతర ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు నమోదుకాగా, శుక్రవారం శంషాబాద్ మండలం కాచారంలో మరో ఇద్దరు డెంగీ బారిన పడ్డారు.
శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. ఇప్పటికే జిల్లాలోని రాజేంద్రనగర్ సహా ఇతర ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు నమోదుకాగా, శుక్రవారం శంషాబాద్ మండలం కాచారంలో మరో ఇద్దరు డెంగీ బారిన పడ్డారు.
విజయ(32), ఆమె కుమారుడు ఉదయ్(13)లు జ్వరంతో నాలుగు రోజుల కిందట శంషాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అనుమానం వచ్చిన వైద్యులు పరీక్షలు నిర్వహించగా, విజయ సహా ఆమె కుమారుడికి డెంగీ సోకినట్లు తెలింది. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ నెల ప్రారంభం నుంచి పక్షానికి పైగా జీహెచ్ఎంసీ కార్మికులు సమ్మె చేయడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ కారణంగానే డెంగ్యూ ప్రబలిఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.