కుమార్తెతో మృతుడు శేఖర్ (ఫైల్ ఫొటో)
ఎచ్చెర్ల క్యాంపస్ శ్రీకాకుళం : ధర్మవరం గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ గుండ శేఖర్ (32) జ్వరంతో విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గత రెండు వారాల క్రితం జ్వరంతో బాధపడుతూ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శేఖర్ చేరారు. ఇతనికి పరీక్షలు చేయించగా వైద్యులు డెంగీ జ్వరంగా నిర్ధారించారు. 17000కు ప్లేట్ లేట్స్ పడిపోవటంతో ప్రత్యేక వైద్య సేవలు అందజేశారు.
అయితే ఆరోగ్యం క్షణించటంతో విశాఖపట్నం తీసుకువెళ్లా లని వైద్యులు సూచించారు. గత వారం రోజులుగా విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రలో చికిత్స పొందు తున్నారు. ఆరోగ్యం కుదుట పడక పోవటంతో శస్త్ర చికిత్స అవసరం అవుతుందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే రక్త పోటు సమస్య వల్ల శస్త్రచికిత్సలో జాప్యం జరిగింది. చివరకు ఆరోగ్యం క్షీణించి శుక్రవారం మృతి చెందాడు.
పోలీస్ కానిస్టేబుల్‌గా డిప్యూటేషన్‌పై ఆమదాలవలస రైల్వేస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. మృతునికి భార్య ఇంద్రావతి, కుమార్తె నిత్య కల్యాణి ఉన్నారు. కుంటుంబ పోషకుడు, జీవనాధారం అయిన వ్యక్తి మృతిని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment