శ్యామాయవలస(మెరకముడిదాం): మండలంలో డెంగీ జ్వరం వణికిస్తోంది. మండలంలోని పులిగుమ్మి పంచాయతీ మధుర
శ్యామాయవలస(మెరకముడిదాం): మండలంలో డెంగీ జ్వరం వణికిస్తోంది. మండలంలోని పులిగుమ్మి పంచాయతీ మధుర గ్రామమైన శ్యామాయవలస గ్రామానికి చెందిన దాసరిదాలినాయుడు(45) అనేవ్యక్తికి డెంగీ వ్యాధి సోకినట్టు విజయనగరం తిరుమల ప్రసాద్
స్పత్రి వైద్యాధికారులు నిర్ధారించారు. దాలినాయుడు కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఎప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో బంధువులు అతనిని విజయనగరం తిరుమల ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అన్ని రకాల టెస్ట్‌లు చేసిన తరువాత దాలినాయుడుకు డెంగీ జ్వరం సోకినట్టు నిర్ధారించారు. రోగికి ప్రస్తుతం తెల్లరక్తకణాలు తగ్గుతున్నాయి. దీంతో తెల్లరక్త కణాలు ఎక్కించేందుకు బంధువులు నానా తంటాలు పడుతున్నారు. అయితే దత్తిరాజేరు మండలం తివిటేరు గ్రామానికి చెందిన రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌డోనర్ సభ్యుడు ముడిదాపురాము ఎప్పటికప్పుడు రోగికి అవసరమైన రక్తాన్ని డోనర్ల ద్వారా అందిస్తున్నాడు. అంతేకాకుండా 15 రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన రాపాక లక్ష్మణరావు అనే వ్యక్తికి డెంగీ సోకగా ప్రైవేటు ఆస్పత్రిలోనే చికిత్స పొందాడు. ఊటపల్లి గ్రామానికి చెందిన రెడ్డిడేవిడ్(20), మీసాలచిన్నయ్య(45)లకు కూడా 15రోజులు క్రితమే డెంగీ జ్వరం సోకింది. వీరు కూడా విజయనగరం ప్రైవేటు ఆస్పత్రిలో వేల రూపాయలు ఖర్చు చేసి చికిత్సను పొందారు. జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులు స్పందించి వెంటనే రెండు గ్రామాలలో పూర్తిస్థాయిలో వైద్యసేవలను అందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
వైద్యాధికారులు సకాలంలో స్పందించాలి
డెంగీజ్వరాలు ఎంత ప్రాణంతకమో వైద్యాధికారులకు తెలియనిది కాదు, అందుకనే వైద్యాధికారులు అప్రమత్తమై ప్రజలను ముం దుగానే అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే పలువురు డోనర్స్ ద్వారా ఈరోగులకు పలు యూనిట్ల బ్లడ్ ప్యాకెట్లను అందజేశాం.
- ముడిదాపు రాము, బ్లడ్‌బ్యాంకు కమిటీ సభ్యుడు