డెంగీ లక్షణాలతో బీటెక్‌ విద్యార్థి మృతి | btech student dies of dengue fever | Sakshi
Sakshi News home page

డెంగీ లక్షణాలతో బీటెక్‌ విద్యార్థి మృతి

Published Fri, Jun 30 2017 11:57 PM | Last Updated on Wed, Jul 10 2019 2:44 PM

btech student dies of dengue fever

ధర్మవరం అర్బన్ : డెంగీ లక్షణాలతో పామిశెట్టి తేజ అనే బీటెక్‌ విద్యార్థి (17) మృతిచెందాడు. ధర్మవరం పట్టణంలోని శివానగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు పామిశెట్టి తేజ ఈ నెల 26న బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద గల శ్రీనివాస రామానుజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎస్‌ఆర్‌ఐటీ) కళాశాలలో బీటెక్‌లో చేరాడు.

అదే రోజు తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అప్పటి నుంచి జ్వరం వస్తుండటంతో పలు ఆస్పత్రుల్లో చూపించారు. వైద్యుల సలహా మేరకు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. తేజ డెంగీ లక్షణాలతో బాధపడుతున్నాడని వైద్యపరీక్షల్లో తేలింది. రక్తంలో ప్లేట్‌లెట్స్‌ పూర్తిగా తగ్గిపోవడంతో గురువారం రాత్రి మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement