
కందుకూరు: డెంగీతో బాధపడుతున్న బాలిక పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈ సంఘటన పట్టణంలో ఆదివారం వెలుగు చూసింది. బంధువుల కథనం ప్రకారం.. పట్టణంలోని బ్రహ్మంగారి గుడి ప్రాంతానికి చెందిన టైలర్ వృతి చేసుకుని జీవనం సాగించే కిరణ్ కుమార్తె పొట్టేట మíహిత∙(5) ఐదు రోజుల క్రితం జ్వరం బారిన పడింది. మొదట పట్టణంలోనే చికిత్స చేయించినా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహిత ఆదివారం మృతి చెందింది. కిరణ్ దంపతులకు మహిత ఏకైక కుమార్తె కావడంతో తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment