మండలంలోని పెద్దగుడిపాడు ఎస్సీ కాలనీలో 20 రోజులుగా విషజ్వరాలు విజృంభిస్తున్నారు. కాలనీలో 60 కుటుంబాలు ఉన్నాయి.
పెద్దగుడిపాడు(దొనకొండ), న్యూస్‌లైన్: మండలంలోని పెద్దగుడిపాడు ఎస్సీ కాలనీలో 20 రోజులుగా విషజ్వరాలు విజృంభిస్తున్నారు. కాలనీలో 60 కుటుంబాలు ఉన్నాయి. 300 మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా రెక్కాడితేగాని డొక్కాడని కూలీలే. గన్నేపల్లి చెన్నమ్మకు చికున్ గున్యా బారినపడి ప్రైవేటు వైద్యశాలను ఆశ్రయించింది. ఇప్పటి వరకు రూ.3 వేల వరకు ఖర్చు చేసినా రోగం తగ్గలేదు. తమ ఇద్దరు సంతానం జ్వరంలో బాధపడుతున్నారని, ప్రభుత్వ వైద్యులు పట్టించుకోవడం లేదని కాలనీకి చెందినదారా విశ్రాంతమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.
మర్రిపూడి మండలంలో..
మర్రిపూడి, న్యూస్‌లైన్: మండలంలో 21 పంచాయతీలలో 38 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ జ్వర పీడితులున్నారు. కూచిపూడికి చెందిన మాచేపల్లి శిరీష(9) అనే బాలిక డెంగీతో ఈ నెల పదో తేదీన మృతి చెందింది. ఇదే గ్రామానికి చెందిన మాచేపల్లి పద్మ(25) డెంగీ బారినపడి గుంటూరులో చికిత్స తీసుకుంది. మర్రిపూడికి చెందిన ఉమ్మనబోయిన అరుణ(9)కు డెంగీ సోకడంతో ఒంగోలులో వైద్యం చేయిస్తున్నారు. వల్లాయపాలెంలో శ్రీనివాసులు, చిలంకూరులో కిత్సపాటి రమణారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి విషజ్వరాలతో బాధపడుతున్నారు.
హనుమంతునిపాడు మండలంలో..
హనుమంతునిపాడు, న్యూస్‌లైన్: మండలంలోని కొత్తూరు, తాళ్లవారిపల్లి, మంగంపల్లి, నారాయిపల్లి, రక్షణాపురం, సీతారాపురంలో చికున్ గున్యా, విషజ్వరాలు, టైఫాయిడ్‌తో ప్రజలు మంచం పట్టారు.