
లాలాపేట: డెంగీ జ్వరంతో ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన బుధవారం లాలాపేటలో చోటు చేసుకుంది. స్థానిక లక్ష్మీనగర్ యాదవ బస్తీకి చెందిన మధుసూదన్‌రెడ్డి, అనిత దంపతుల ఏకైక కూతురు రుత్విక(4)కు నాలుగు రోజుల క్రితం తీవ్రమైన జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ఓ క్లినిక్‌లో చూపించారు. పరీక్షించిన వైద్యుడు పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో రెండు రోజుల క్రితం బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ రుత్విక బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారి స్థానికంగా ఉన్న ఆశ్రయ్ మోడల్ స్కూల్లో యూకేజీ చదువుతుండడంతో బుధవారం ఆ పాఠశాలకు సెలవు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment