షోలాపూర్, న్యూస్‌లైన్: పట్టణంలో డెంగీ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి సోకి ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో 14 మందికి ఈ రోగం సోకిందని, వీరంతా ప్రభుత్వ, ప్రైవేట్ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఎస్‌ఎంసి ఆరోగ్య శాఖ అధికారి జయంతి ఆడ్కే మంగళవారం తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ పట్టణ పరిసర ప్రాంతాల్లో డెంగీ వ్యాధి వెలుగులోకి వచ్చింది.
పూజా నలువాడే, పూజా చాయిస్కర్ అనే బాలికలు డెంగీ బారిన పడి, విజయ్ బోసుళే మలేరియా పాజిటివ్‌తో మృతి చెందారన్నారు. పట్టణంలోని అనేక ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌లు సోకిన వారు అధిక సంఖ్యలోనే చికిత్స పొందుతున్నారని ఆమె వివరించారు. అలాగే ఒక కేసులో జైలు జీవితం గడుపుతున్న కళావతి పండారె అనే మహిళా ఖైదీకి కూడా డెంగీ సోకిందని ఆమె చెప్పారు.కాగా, డెంగీ నివారణకుగాను తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ఎంపీ శరద్ బన్‌సోడే, ఎస్‌ఎంసీ కమిషనర్ చంద్రకాంత్ గూడేంవార్ ఆరోగ్య విభాగం అధికారులతో సమీక్షించారు.
అనంతరం వారితో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. పట్టణవ్యాప్తంగా ఫ్యాగింగ్ చేయించాలని, టైఫాయిడ్ నివారణ మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు. డీఐటీ వంటి ఔషధాలు కూడా పంపిణీ చేస్తున్నామని కమిషనర్ ఆయనకు వివరించారు. నయిజిందగి, సిద్ధేశ్వర్ నగర్, సలుగార్ వస్తి, కుముటనాకా అలాగే స్లండం ప్రాంతాల్లో డెంగీ విస్తరిస్తున్న దరిమిలా ఆయా ప్రాంతాలో ప్రత్యేక నివారణ చర్యలు చేపట్టినట్లు జయంతి అడ్కే చెప్పారు.
షోలాపూర్‌లో విస్తరిస్తున్న డెంగీ
Published Tue, Nov 4 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
Advertisement
Advertisement