శివమణి
చిట్యాల(నకిరేకల్) : చిట్యాల పట్టణంలో గురువారం తెల్లవారుజామున డెంగీ వ్యాధి లక్షణాలతో ఓ బాలుడు మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ముత్యాలమ్మగూడెం గ్రామానికి చెందిన బొబ్బలి రాములు కుమారుడు శివమణి(7) చిట్యాలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. వారం రోజుల క్రితం తీవ్రజ్వరం రావడంతో స్థానికంగా వైద్యం చేయించారు.
అయినా తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం శివమణిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు డెంగీ వ్యాధి లక్షణాలతో శివమణి బాధపడుతున్నట్లు గుర్తించి వైద్యం అం దించారు. పరిస్థితి విషమించడంతో శివమణి గురువారం తెల్లవారుజామున మృతి చెందా డు. కాగా శివమణి చెల్లెలు భావన కూడా విషజ్వరంతోనే బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతోంది.
ఓ వైపు కుమారుడు మృతి చెందడం, కూతురు విషజ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలిసి వేసింది. శివమణి మృతదేహా న్ని చిట్యాల జెడ్పీటీసీ శేపూరి రవీందర్ సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యు లకు రూ.5వేల ఆర్థికసాయం అందించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బెల్లి సత్తయ్య, వార్డు సభ్యులు ఏళ్ల మల్లేష్, టీఆర్‌ఎస్వీ పట్టణ అధ్యక్షుడు కోసనపు అశోక్, రాము, సల్లా రాజు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment