డెంగ్యూతో యువకుడి మృతి | youth dies over dengue fever in nizamabad district | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో యువకుడి మృతి

Published Wed, Nov 4 2015 7:25 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

youth dies over dengue fever in nizamabad district

నిజామాబాద్: తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ వ్యాధి విజృంభీస్తోంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు డెంగ్యూ వ్యాధితో మరణించాడు. వర్ని మండలం  వడ్డేపల్లి గ్రామానికి చెందిన పెర్క యోగేశ్ (22)కు పది రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానిక ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నాడు.

జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డెంగ్యూ వ్యాధిగా గుర్తించిన వైద్యులు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మరణించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement