
ఎంపీ బాల్క సుమన్‌కు డెంగీ జ్వరం
పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు డెంగీ జ్వరం సోకినట్లు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి డాక్టర్లు నిర్దారించారు. మూడు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్ వెళ్లిన ఆయన యశోద ఆస్పత్రిలో చేరారు.
మంగళవారం రక్త నమూనాలు సేకరించిన ఐపీఎం సంస్థకు పంపగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఇన్‌పేషెంట్‌గా చేరి సుమన్ చికిత్స అందుకుంటున్నారు. ఆయనకు డాక్టర్ విజయ్‌కుమార్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.