peddapalli mp
-
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మార్పుపై బీజేపీ ట్విస్ట్?
పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా ఉంది. జంప్ కొట్టు... టికెట్ పట్టు అన్నది ఆ ఎంపీ సూత్రం. ఆయన జంప్ అయితే ఆయ్యారు కానీ అవతల టికెట్ ఇవ్వాల్సిన వాళ్లు మాత్రం కామ్‌గా చేతులెత్తేస్తున్నారు. దీంతో నెక్ట్స్ ఏం చేయాలో తోచని ఆయోమయ పరిస్థితుల్లో మరో పార్టీకి జంప్ ఆలోచనలో ఉన్నారు ఎంపీ వెంకటేష్.తాజాగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిశారు. పెద్దపల్లి టికెట్ ఇస్తే పార్టీలో చేరతానని కిషన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. అయితే పార్టీ హైకమాండ్‌తో మాట్లాడి చెప్తానని కిషన్ రెడ్డి అన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే బీజేపీ గోమా శ్రీనివాస్‌ను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆయనకు బీఫాం ఇవ్వలేదు. అయిన్పటికీ గోమాస శ్రీనివాస్ నేడు నామినేషన్ వేశారు. ఈ క్రమంలో అసలు పెద్దపల్లి బీఫామ్‌ను బీజేపీ ఎవరికి ఇవ్వనుంది, వెంకటేష్ నేత అసలు పోటీ చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి నామినేషన్ చివరి రోజైన రేపు(గురువారం) పెద్దపల్లి అభ్యర్థి మార్పుపై బీజేపీ ట్విస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకుడైన వెంకటేష్ నేత గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచారు. అయితే మళ్లీ బీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుందో రాదో అని భావించిన వెంకటేష్.. ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరారు. కేవలం ఎంపీ టికెట్ కోసం కండువా మార్చేసినా.. చివరికి నిరాశే మిగిలింది. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ మొండిచేయి చూపింది. గడ్డం వివేక్ కొడుకు వంశీకి టికెట్ ప్రకటించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక కాంగ్రెస్‌లో ఉండి ప్రయోజనం లేదంటూ మళ్లీ పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వెంకటేష్ నేత బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎంపీ
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇక, పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్‌లో చేరారు. వివరాల ప్రకారం.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్‌లో చేరిపోయారు. తాజాగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి ఎంపీ వెంకటేష్ వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. వెంకటేష్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. కాంగ్రెస్ లో చేరిన BRS పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత BRS Peddapally MP Venkatesh Neta joined Congress ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన BRS పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత)… pic.twitter.com/To99hdcLru — Congress for Telangana (@Congress4TS) February 6, 2024 కాగా, ఎంపీ వెంకటేష్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి మళ్లీ హస్తం గూటికి చేరారు. ఇక, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్టు సమాచారం. ఇక, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, లోక్‌సభ ఎన్నికల వేళ సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడం బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ ఎక్కడైనా కనిపించారా?
సాక్షి, మంచిర్యాల: పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కనబడడం లేదంటూ ఆయన ఫొటోను పట్టుకుని బీజేపీ, బీజేవైఎం నాయకులు బెల్లంపల్లి చౌరస్తా నుంచి ర్యాలీగా వెళ్లి మంచిర్యాల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు మాట్లాడుతూ.. పెద్దపల్లి ఎంపీ ఫొటోను పట్టుకుని అన్ని షాపులు, ప్రజలను కనిపించారా..? అని ప్రశ్నిస్తే కనబడలేదనే సమాధానం చెప్పారని, ఎంపీగా గెలిచినప్పటినుంచి జిల్లాలో అప్పుడప్పుడు పర్యటించడమే తప్ప ప్రజల వద్దకు వెళ్లడంగానీ, ప్రజా సమస్యలపైన తెలుసుకునే ప్రయత్నంగానీ చేయడం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏబీవీపీ కార్యకర్తగా పనిచేస్తూ అంచలంచెలుగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారని, అదే వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయి ఎంపీ టికెట్‌పై గెలిచారని, నాడు కాంగ్రెస్ ఉంటూ టీఆర్ఎస్ పార్టీని ఇష్టారీతిన తిట్టిన వ్యక్తి కేసీఆర్‌పై ప్రేమను చూపిస్తున్నారని పేర్కొన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా సమస్యలపై మాట్లాడాలని, దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని అడగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వర్రావు, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు రాచకొండ సత్యనారాయణ, బీజేపీ జిల్లా కార్యదర్శి మల్యాల శ్రీను, వాణిజ్య సెల్ కన్వీనర్ రంగ శ్రీశైలం, ప్రభాకర్, ముథా మల్లేశ్, పల్లి రాకేశ్, బోయిని దేవేందర్, గంగన్న, మల్లిఖార్జున్, రాజన్న, శ్రీకాంత్, తరుణ్ సింగ్, ప్రసన్న పాల్గొన్నారు. చదవండి: లాయర్ దంపతుల హత్య: మే 17లోగా చార్జిషీట్ -
ఎంపీ బాల్క సుమన్‌కు డెంగీ జ్వరం
పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు డెంగీ జ్వరం సోకినట్లు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి డాక్టర్లు నిర్దారించారు. మూడు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్ వెళ్లిన ఆయన యశోద ఆస్పత్రిలో చేరారు. మంగళవారం రక్త నమూనాలు సేకరించిన ఐపీఎం సంస్థకు పంపగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఇన్‌పేషెంట్‌గా చేరి సుమన్ చికిత్స అందుకుంటున్నారు. ఆయనకు డాక్టర్ విజయ్‌కుమార్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. -
ఆంధ్రానేతలతో కలసి వ్యాపారం చేస్తే తప్పేంటి?
మెదక్ : తెలంగాణ టీడీపీ నాయుకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా ప్రతినిధిగా రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని వారు ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కరీనగర్ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మర్రి జనార్థన్‌లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గతంలో రేవంత్‌రెడ్డి చేసిన పలు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వారు తెలిపారు. పలు కేసుల్లో నిందితులతో రేవంత్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని విమర్శించారు. త్వరలో రేవంత్ బండారం బయటపడతామని వారు హెచ్చరించారు. కొడంగల్ ప్రజా కోర్టులో చర్చకు సిద్ధమా అంటూ రేవంత్‌కు సవాల్ విసిరారు. మెదక్ ఉపఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని వారు జోస్యం చెప్పారు. ఆంధ్రానేతలతో కలిసి వ్యాపారం చేస్తే తప్పేంటని వారు రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దీన్ని రాద్ధాంత చేయడం తగదని హితవు పలికారు. రేవంత్‌రెడ్డి కాంట్రాక్టర్‌ను బెదిరించి డబ్బు వసూల్ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై చేసిన విమర్శలను వెంటనే నిరూపించాలని రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. రాజకీయ అసూయతోనే రేవంత్ ఆరోపణలు చేస్తున్నారని బాల్క సుమన్, గువ్వల బాలరాజు, మర్రి జనార్థన్ తెలిపారు. -
కారు దిగుతారా?
ఈ ఎన్నికల్లో వివేకంతో వ్యవహరించాలని పెద్దపల్లి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కాకాగా పేరు మోసిన జి.వెంకటస్వామి కొడుకు వివేక్ డిసైడ్ అయ్యారు. తెలంగాణ తెచ్చానని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ కంటే ఇచ్చిన కాంగ్రెస్‌నే ఆయన నమ్ముకోవాలని ఆలోచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని వివేక్ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణకు దళిత సీఎం అని ప్రచారం జరుగుతున్న సమయంలో కాలం కలిసొస్తే తనకు ముఖ్య పదవి లభిస్తుందని ఆయన ఊహిస్తున్నారు. ఈ విషయంలో రాహుల్ సన్నిహితుడు, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు అండదండలు వివేక్‌కు దొరికినట్టు తెలుస్తోంది. ఇక తొందరపడి ముందే కూసిన కోయిలలా....కారెక్కినా అందులో సరైన ట్రీట్మెంట్ లభించకపోవడం, కీలక నిర్ణయాల్ని తనకు మాట మాత్రమైన చెప్పకపోవడం వివేక్‌కు బాగా బాధపెడుతోన్నట్లు తెలుస్తోంది. దాంతో ‘కారు ’పై మోజు తీరిందో ఏమో కానీ ఆయన మళ్లీ తన పాత గూటికే అడుగులు వేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో తెలంగాణ ఉద్యమం పేరుతో వార్తల్లో కనిపించే వివేక్ ఇప్పుడు తెరచాటు అయ్యారు. టీఆర్ఎస్లో ఆయన ఊసే వినిపించటం లేదు. టీఆర్ఎస్ పార్టీలో చేరితో ఏదో ఒరుగుతుందని అనుకున్న వివేక్ అక్కడ ఏ విషయం లేకపోయే సరికి మళ్లీ చేయి అందుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.