కేఎంసీ, న్యూస్‌లైన్
జిల్లాలో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మారుమూల గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా మలేరియా, పారా మలేరియా, సెరబ్రల్ మలేరియా, డెంగీ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రులను ఆశ్రరుుస్తున్నారు. ఈ ఏడాది క్రమం తప్పకుండా వర్షాలు కురవగా... సీజనల్ వ్యాధుల ప్రభావం అంతంతమాత్రంగానే కనిపించింది. వాతావారణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో 20 రోజు లుగా అధిక సంఖ్యలో ప్రజలు జ్వరాల బారిన పడగా... ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న నిర్వాహకులు వారి వద్ద దండుకుంటున్నారు. డెంగీ జ్వరాలు ప్రబలుతుండడంతో ప్రైవేట్ బ్లడ్ బ్యాంకు యజ మానులు కొందరు ఇటీవలే ప్లేట్‌లెట్ యంత్రాలను తెప్పించి దోపిడీకి రంగం సిద్ధం చేశారంటే... పరిస్థితి ఇట్టే గ్రహించవచ్చు. అరుునా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. గ్రామాల్లో ఇదివరకే వైద్య శిబిరాలు నిర్వహించాం... అవగాహన కల్పించామని చేతులు దులుపేసుకుంటుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు.
ఇదీ... ఎంజీఎం దుస్థితి
సాధారణంగా ఆరోగ్యవంతుడైన వ్యక్తి రక్తంలో లక్షా 50 వేల నుంచి 5 లక్షల వరకు ప్లేట్‌లెట్ కణాలుంటాయి. డెంగీ జ్వరంతో బాధ పడుతున్న బాధితులకు రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఒక్కోసారి 20 వేల లోపు వరకు ప్లేట్‌లెట్లు తగ్గి రక్త విరేచనాలతోపాటు కోమాలోకి వెళ్లే అవకాశముంటుంది. రక్తం, ప్లేట్ లెట్లను సరైన సమయంలో అందించకుంటే పరిస్థితి విషమించి మరణం సంభవిస్తుంది. ఈ మేరకు పేదలకు అందుబాటులో సింగిల్ ప్లేట్‌లెట్ మిషన్‌ను ఏర్పాటు చేయూల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ... సర్కారు అలసత్వం... అధికారుల నిర్లక్ష్యం వెరసి అది అందుబాటులోకి రావడం లేదు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు తలమానికంగా నిలుస్తున్న ఎంజీఎం ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రంలో సింగిల్ ప్లేట్‌లెట్ మిషన్ లేకపోవడం డెంగీ జ్వరాల బారిన పడిన పేదలను ఇబ్బందుల పాలుజేస్తోంది. వారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ రక్తనిధి కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఎంజీఎంలో నిరుపయోగంగా
ఎలీసా పరికరం
డెంగీ వ్యాధి నిర్ధారణ కోసం ఉపయోగించే ఎలీసా టెస్ట్ పరికరం ఎంజీఎం ఆస్పత్రిలో నిరూపయోగంగా పడి ఉంది. లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన ఈ పరికరాన్ని ఇప్పటివరకు వినియోగంలోకి తేలేదు. ఆ పరికరం సక్రమంగా పనిచేయూలంటే ఏసీ తప్పనిసరి. ఇలాంటి నేపథ్యంలో అసలు విద్యుత్ సరఫరా లేదు... అంతేకాదు... ఎంజీఎంలో డెంగీ జ్వరానికి సంబంధించిన మందులు కూడా అందుబాటులో లేవు. దీన్ని బట్టి ఎంజీఎంలో రోగులకు కనీస వసతులు కల్పించడంలో కేఎంసీ, ఎంజీఎం అధికారులు విఫలమవుతున్నారని చెప్పవచ్చు.
రోజురోజుకూ పెరుగుతున్న జ్వరపీడితులు
Published Wed, Oct 2 2013 2:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
Advertisement