
వినేష్ మృతదేహం
కీసర: డెంగీతో ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన ఆదివారం కీసర రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో చోటుచేసుకుంది. రాజీవ్ గృహకల్పలో నివసించే సాయిచంద్ర కుమారుడు జి.వినేష్ (9 నెలలు) వారం రోజుల క్రితం జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు నాగారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జ్వరం తగ్గకపోవడంతో ఏఎస్‌రావునగర్‌లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు చికిత్సలు అందించారు. పరిస్థితి విషమించడంతో యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. దీంతో వినేష్ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.