వైద్యుల నిర్లక్ష్యంతో డెంగ్యూ వ్యాధి ఉన్న ఓ యువకుడు ( 24) మరణించాడంటూ.. ప్రైవేటు ఆస్పత్రిపై అతడి బంధువులు దాడి చేశారు.
వైద్యుల నిర్లక్ష్యంతో డెంగ్యూ వ్యాధి ఉన్న ఓ యువకుడు ( 24) మరణించాడంటూ.. ప్రైవేటు ఆస్పత్రిపై అతడి బంధువులు దాడి చేశారు. కాకినాడ సర్పవరం ప్రాంతంలో ఉన్న ఆస్పత్రిలో అమలాపురం ప్రాంతానికి చెందిన ర్యాలి పవన్ కుమార్ అనే యువకుడు డెంగ్యూతో శనివారం రాత్రి చేరాడు. ఆదివారం రాత్రికల్లా అతడు మరణించాడు. ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ అతడి సంబంధీకులు ఆస్పత్రిపై దాడిచేసి అక్కడి ఫర్నిచర్ను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆదివారం మధ్యాహ్నం వరకు పవన్ కుమార్ జీవించి ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తమకు అబద్ధం చెప్పాయని, వాస్తవానికి అతడు ఒక రోజు ముందే వైద్యుల నిర్లక్ష్యం వల్ల మరణించినా.. ఆ విషయాన్ని చెప్పలేదని బంధువులు ఆరోపించారు. పవన్ కుమార్ డెంగ్యూ జ్వరంతోను, ప్లేట్లెట్ల కౌంటు గణనీయంగా పడిపోయిన పరిస్థితిలో తమ ఆస్పత్రిలో చేరాడని వైద్యుల అంటున్నారు. తాము వీలైనంత మంచి చికిత్స అందించామని, చికిత్సలో నిర్లక్ష్యం ఏమాత్రం లేదని తెలిపారు. పోలీసుల జోక్యంతో ఎట్టకేలకు ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది.