పేదరికాన్ని జయించి.. ప్రభుత్వ కొలువులు సాధించి.. | Fire Station Constable Job To Poor Family | Sakshi
Sakshi News home page

పేదరికాన్ని జయించి.. ప్రభుత్వ కొలువులు సాధించి..

Published Mon, May 20 2024 6:51 AM | Last Updated on Mon, May 20 2024 7:09 AM

Fire Station Constable Job To Poor Family

పేదరికం.. చదువుకు అడ్డుకాదని నిరూపించారు. విద్యే ఆయుధంగా చేసుకొని జీవితంపై పోరాడారు. చదువులు పూర్తయిన వెంటనే పోటీ పరీక్షలకు సిద్ధమై ముగ్గురు కూడా.. ఒకరి తర్వాత మరొకరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వారే హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన రాజ్‌కుమార్, శ్వేత, శ్రీకాంత్‌. తండ్రి హమాలీ కారి్మకుడిగా పడిన కష్టానికి న్యాయం చేకూర్చారు. పట్టణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.  

హుస్నాబాద్‌: పట్టణానికి చెందిన చేర్యాల మైసయ్య, స్వరూప దంపతులు. వీరికి రాజ్‌కుమార్, శ్వేత, శ్రీకాంత్‌ సంతానం. పెద్ద కుమారుడు రాజ్‌కుమార్‌ అక్కన్నపేట పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. కూతురు శ్వేత గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుంది. చిన్న కుమారుడు శ్రీకాంత్‌ నెల రోజుల క్రితం ఫైర్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. కాల్‌ లెటర్‌ రాగానే జూలైలో ఫైర్‌ కానిస్టేబుల్‌గా శిక్షణ పొందనున్నాడు. 

 తండ్రి మైసయ్య రోజు వారి హమాలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంటిని చక్కదిద్దుకుంటూనే సంతానాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సంకలి్పంచారు. భవిష్యత్‌లో తన పిల్లలు ఉన్నతమైన స్ధానంలో ఉండాలని ఆకాంక్షించారు. కష్టాన్ని పంటి కింద భరిస్తూనే  కూలీ పనులు చేస్తూ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించారు. అనంతరం ఉద్యోగులు సాధించాలని భావించాడు. తండ్రి కష్టాన్ని చూసిన వారు కూడా ఆయన నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement