కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
-
ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘ నాయకుల ధర్నా
హుస్నాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అంతకుముందు పెన్షనర్లు అంబేద్కర్ చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్‌టీఓలకు వినతిపత్రం అందించారు. సంఘం నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ప్రకటించిన పీఆర్సీ బకాయిలు ప్రకటించి 9 నెలలు గడుస్తున్నా చెల్లించలేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. హెల్త్‌కార్డుల అమలు, డీఏ బకాయిలతోపాటు పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ మండలాల సంఘ అధ్యక్షులు వీర సోమయ్య, లింగమూర్తి, ప్రభాకర్‌రెడ్డి, అంతయ్య, భూపతిరెడ్డి, నర్సింహారెడ్డి, నాయకులు చిట్టి దేవేందర్‌రెడ్డి, పూల గోపాల్‌రెడ్డి, రాజమల్లయ్య, చంద్రయ్య, బాషుమియా, నంబయ్య, సంజీవరెడ్డి, ఉషారాణి, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.