నగర పంచాయతీ కార్యాలయం
హుస్నాబాద్ : హుస్నాబాద్ మేజర్ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయి ఆదాయం పెరిగినా.. ఇంకా లోటు బడ్జెట్‌తోనే కాలం వెల్లదీస్తోంది. ఖర్చులు భారీగా పెరగడంతో పన్నుల రూపేనా వచ్చిన డబ్బుతో ఏ ఒక్క అభివృద్ధి పనికి వెచ్చించలేకపోతున్నారు. కేవలం ప్రభుత్వం వివిధ గ్రాంట్ల నుంచి విడుదల చేసిన వాటితోనే అభివృద్ధి పనులు దర్శనమిస్తున్నాయి.
-
సర్కారు నిధులతోనే అభివృద్ధి పనులు
-
వేధిస్తున్న లోటు బడ్జెట్
-
ఇదీ నగరపంచాయతీ తీరు..
హుస్నాబాద్ : హుస్నాబాద్ మేజర్ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయి ఆదాయం పెరిగినా.. ఇంకా లోటు బడ్జెట్‌తోనే కాలం వెల్లదీస్తోంది. ఖర్చులు భారీగా పెరగడంతో పన్నుల రూపేనా వచ్చిన డబ్బుతో ఏ ఒక్క అభివృద్ధి పనికి వెచ్చించలేకపోతున్నారు. కేవలం ప్రభుత్వం వివిధ గ్రాంట్ల నుంచి విడుదల చేసిన వాటితోనే అభివృద్ధి పనులు దర్శనమిస్తున్నాయి. ఆదాయం మూరెడు.. ఖర్చు బారేడు అన్న చందంగా మారింది నగరపంచాయతీ తీరు.
హుస్నాబాద్ నగర పంచాయతీ పాలకవర్గం 2016–2017 బడ్జెట్ రూ.16.27 కోట్లతో అంచనా వేసింది. పన్నులు పెంచి దాదాపు పూర్తిస్థాయిలో వసూలు చేసినా ఖర్చులకే సరిపోవడంతో అభివృద్ధి పనులు శూన్యంగా మారాయి. రాబడి బాగానే ఉన్నా అంతకు మించి ఖర్చులవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పన్నుల భారం పెరిగినా అంతే రీతిలో అభివృద్ధి జరుగుతుందని పాలకులు ప్రజలను ఒప్పించారు. అయితే అందుకు విరుద్దంగా జరుగుతుండటంతో ప్రభుత్వం నుంచి పలు గ్రాంట్ల ద్వారా వచ్చిన నిధులతో చేసిన అభివృద్ధినే ప్రజలకు చూపిస్తున్నారు. వివిధ పన్నుల రూపంలో వసూళ్లు రూ.1కోటికి పైగా వచ్చినా నిర్వాహణకే ఖర్చయిపోతున్నట్లు తెలుస్తోంది.
ఆదాయ వనరులు ఇవే
నగర పంచాయతీకి యేటా గణనీయంగా ఆదాయం సమకూరుతుంది. ముఖ్యంగా 2015–2016 వరకు ఆస్తి పన్ను కింద రూ.18.76లక్షలు డిమాండ్ ఉండగా, రూ.79 లక్షలు వసూలు చేశారు. ఇవే కాకుండా అదికారులు చెప్పిన వివరాలు సుమారుగా స్టాంప్ డ్యూటీరూ.20లక్షలు, వినోద పన్ను 12 లక్షలు, అడ్వరై్టజ్‌మెంట్ ద్వారా 2లక్షలు, అంగడి ఆదాయం ద్వారా రూ.60లక్షలు, సెల్ టవర్స్ ద్వారా 1లక్ష, షాపింగ్ కాంప్లెక్స్ కింద రూ.3లక్షలు ఇలా నగర పంచాయతీకి ఆదాయం దాదాపు రూ.1.77 కోట్లు సమకూరుతుందని అ«ధికారులు చెబుతున్నారు. పన్నుల రూపంలో వచ్చిన నిధుల నుంచి ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్ కింద దాదాపు కొంత శాతం సంబంధిత కాలనీలో పలు అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఇవీ ఖర్చులు..
నగర పంచాయతీ ఖర్చులు ఆదాయాన్ని మించిపోతున్నాయి. పారిశుధ్య కార్మికులకు ఏడాదికి రూ. 84 లక్షలు, విద్యుత్ బిల్లులు రూ.84 లక్షలు, డిజిల్ ఖర్చు రూ.12లక్షలవుతున్నాయి. ఇక కార్యాలయ నిర్వాహణ వ్యయం ఏడాదికి రూ.6లక్షల వరకు వెచ్చిస్తున్నారు. ఇలా మొత్తం రూ.1 కోటి 86లక్షలు అవుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పటి వరకు మేజర్ గ్రామ పంచాయతీ బకాయిలు దాదాపు రూ.3 కోట్లు ఉందని, ఇప్పటి వరకు వాటిని తీర్చుకుంటూ వస్తున్నందును లోటు బడ్జెట్ ఉందని అధికారులు చెబుతున్నారు.
గ్రాంట్ల ద్వారానే అభివృద్ధి పనులు
పన్నుల రూపంలో వచ్చే నిధులు కేవలం జమా ఖర్చులకే తప్పా అభివృద్ధి పనులకు ఎక్కడా వెచ్చించిన పరిస్థితి లేదు. ఆదాయంతో పోల్చితే ఖర్చు అధికంగా ఉండటంతో ప్రభుత్వం మంజూరు చేసే గ్రాంట్ల పైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్లాన్, నాన్ ప్లాన్ గ్రాంటు, 14వ ఆర్థిక సంఘం ని«ధులు, ఎఎస్‌సీ నిధులతో నే పట్టణంలో పలు వార్డుల్లో సీసీరోడ్లు, మురుగుకాలువలు, తాగునీరు. పైపులైన్, విద్యుత్ మరమ్మతులకు వెచ్చిస్తున్నారు.
ఆదాయంతో పోల్చితే ఖర్చులెక్కవ..
–కుమారస్వామి, కమిషనర్
నగర పంచాయతీ ఆదాయంతో పోల్చితే ఖర్చులే అధికంగా ఉన్నాయి. కార్మికుల వేతనాలు, కరెంట్ బిల్లుల చెల్లింపులకే ఆదాయం సరిపోతుంది. గ్రామ పంచాయతీ బకాయి బిల్లులు చెల్లిస్తూ రావడం లోటు బడ్జెట్‌కు ఓ కారణమని చెప్పవచ్చు. వచ్చే ఏడాది వరకు మిగులు బడ్జెట్‌కు కృషి చేస్తాం. ఆదాయ మార్గాల్లో కొన్నింటిలో పెంచితే తప్పా ఖర్చుకు తగిన ఆదాయం సమకూరే పరిస్థితి లేదు. మిగతా నగర పంచాయతీలతో పోల్చితే ఇక్కడ పన్నులు తక్కువగా ఉన్నాయి.