ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి
Published Tue, Oct 4 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్డు శివారులోని కల్వర్టు వద్ద సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి బస్సు అద్దాలు పగులగొట్టారు. బస్సు డ్రైవర్ చంద్రారెడ్డి కథనం ప్రకారం.. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్ హన్మకొండ నుంచి సిద్దిపేటకు వెళ్తోంది. మార్గమధ్యంలో హుస్నాబాద్ శివారులో కల్వర్టర్ సమీపంలో ఎదురుగా రెండు బైక్‌లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు బస్సు ఆపాలని కోరారు. దీంతో డ్రైవర్ చంద్రారెడ్డి బస్సు నిలపివేశాడు. బైక్‌పై వచ్చిన వారు బస్సు వెనుక భాగంలోని అద్దాలను పగులగొట్టారు. దీంతో 20 మంది ప్రయాణికులు భయంతో బస్సు దిగి పరుగులు పెట్టారు.ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement