KTR Slams Bandi Sanjay At Husnabad BRS Meeting - Sakshi
Sakshi News home page

ఎంపీగా నాలుగేళ్లు ఏం చేశాడో చెప్పే ధైర్యం లేదు: బండి సంజయ్‌పై కేటీఆర్‌ ఫైర్‌

Published Fri, May 5 2023 2:19 PM | Last Updated on Fri, May 5 2023 3:25 PM

KTR Slams Bandi Sanjay At Husnabad BRS Meeting - Sakshi

సాక్షి, సిద్ధిపేట: వినోద్‌ కుమార్‌ను ఎంపీగా గెలిపించుకుంటే కరీంనగర్‌కు ట్రిపుల్‌ ఐటీ వచ్చేదని మంత్రి కేటీఆర్‌ పేర్కొనన్నారు. ప్ర‌స్తుత ఎంపీ వ్య‌వ‌హారంతో క‌రీంన‌గ‌ర్ ప్ర‌జ‌లు సిగ్గుతో త‌ల‌దించుకుంటున్నారు. నాలుగేళ్లు ఎంపీగా ఉండి బండి సంజయ్‌ ఏం చేశాడో చెప్పే ధైర్యం లేదని విమర్శించారు. ఓ గుడి, బడి, యూనివ‌ర్సిటీ కట్టలేదని ధ్వజమెత్తారు. కేవలం మతాల పేరుతో రెచ్చగొట్టడం తప్ప చేసిందేం లేదని మండిపడ్డారు.

ఈ మేరకు హుస్నాబాద్‌ బీఆర్‌ఎస్‌ ప్రజాశీర్వాద సభలో కేటీఆర్‌ మాట్లాడారు. ‘మోదీ దేవుడ‌ని అంటున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన‌ని మోసం చేసిన మోదీ దేవుడా? రైతుల క‌ష్టాలు, సిలిండ‌ర్ ధ‌ర‌లు పెంచినోడు దేవుడా..? ద‌య‌చేసి ఆలోచించండి. ఇలాంటి పిచ్చోళ్ల‌ను పార్ల‌మెంట్‌కు పంపితే జ‌రిగే న‌ష్టం ఇదే. అభివృద్ధికి పునాదులు త‌వ్వాలి. కానీ హింస‌కు కాదు. ఎమ్మెల్యే స‌తీశ్‌తో పాటు ఎంపీ అభ్య‌ర్థి వినోద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని కేటీఆర్ కోరారు.

కాగా కాద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ శుక్రవారం పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ క్రమంలో హుస్నాబాద్​ నియోజకవర్గంలో కోటి రూపాయలతో నిర్మించిన ఇండోర్​ స్టేడియాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కాసేపు బ్యాడ్మింటన్​ ఆడి సందడి చేశారు. ఆయనతో పాటు హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు వినోద్​ కుమార్​తో బ్యాడ్మింటన్​ ఆడారు. 
చదవండి: కోమటిరెడ్డికి జ్వరమొచ్చిందో.. ఏం నొప్పొచ్చిందో నాకేం తెలుసు?: జానా రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement