సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఇప్పటి పరిస్థితికి కేటీఆర్ అహంకారమే కారణమని సంచలన కామెంట్స్ చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. కాంగ్రెస్, బీజేపీ ఎప్పటికీ ఒకటి కాదు. అసలు దోస్తీ.. కాంగ్రెస్, కేసీఆర్ మధ్యే ఉందన్నారు. వీరి మధ్య స్నేహం లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ ట్వీట్‌కు బండి సంజయ్ కౌంటరిచ్చారు. తాజాగా బండి సంజయ్.. హర్యానా, కశ్మీర్ ఎన్నికలకు కాంగ్రెస్ ఖర్చు చేసిన డబ్బు బీఆర్ఎస్ పార్టీదే. కేటీఆర్ అహంకారమే బీఆర్ఎస్ ఈ పరిస్థితికి కారణం. కేటీఆర్ అహంకారపూరిత మాటల వలనే బీఆర్ఎస్ ఓటమికి కారణం. కేటీఆర్ వల్లే కేసీఆర్ సర్వనాశనం అయ్యారు. ఇప్పుడు మళ్లీ అదే అహంకారంతో కేటీఆర్ మాట్లాడుతున్నాడు.
కాంగ్రెస్, బీజేపీ ఒకటి కానే కాదు. దోస్తానంటే ఫోన్లలో మాట్లాడుకుంటారు మీడియాకు స్టేట్‌మెంట్లు ఇవ్వరు. అసలు దోస్తాన్ కేసీఆర్, కాంగ్రెస్ మధ్యనే ఉంది. హర్యానా, కశ్మీర్ ఎన్నికల్లో కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీకి డబ్బు పంపింది వాస్తవం కాదా కేటీఆర్?. డబ్బుల సంచులతో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీతో లాలూచీ పడ్డది వాస్తవమా కాదా కేటీఆర్ చెప్పాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య స్నేహ సంబంధాలు లేకపోతే ఫోన్ టాపింగ్, కాళేశ్వరం విచారణలు ఏమయ్యాయి?.
ఫోన్ ట్యాపింగ్‌లో ఉన్న రిపోర్టు ప్రకారం కనీసం కేసీఆర్‌కు 41సీఆర్‌పీసీ నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదు?. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయి అనే దానికి నిదర్శనం ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో స్నేహ సంబంధాలు లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి. సీబీఐ ద్వారా విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయి’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment