కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ విలీనం.. కేటీఆర్‌ పీసీసీ చీఫ్‌: బండి సంజయ్‌ | Minister Bandi Sanjay Sensational Comments On Congress And BRS Merger News, More Details Inside | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ విలీనం.. కేటీఆర్‌ పీసీసీ చీఫ్‌: బండి సంజయ్‌

Published Fri, Aug 16 2024 4:04 PM | Last Updated on Fri, Aug 16 2024 4:48 PM

Minister Bandi Sanjay Sensational Comments On Congress And BRS

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ రాజకీయాలపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ విలీనం కాబోతుందన్నారు. కేటీఆర్‌ను పీసీసీ చీఫ్‌ అవుతారని జోస్యం చెప్పారు. అలాగే, కవిత బెయిల్‌పై కావాలనే కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

కాగా, కేంద్రమంత్రి బండి సంజయ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ విలీనం తథ్యం. ఈ క్రమంలోనే కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్‌, కవితకు రాజ్యసభ సీటు ఖాయం. బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర ఆ పార్టీల సొంతం. కవిత బెయిల్‌కు, బీజేపీకి ఏం సంబంధం?. బీఆర్ఎస్ పార్టీది ముగిసిన అధ్యాయం. ప్రజలు ఛీత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదు. బీఆర్ఎస్‌ను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. అతి త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమవడం తథ్యం.

బీఆర్ఎస్‌ను వీలీనం చేసుకుంటే బెయిల్ వస్తుందనడం మూర్ఖత్వం. ఆమ్‌ ఆద్మీ పార్టీని విలీనం చేసుకుంటేనే సిసోడియాకు బెయిల్ వచ్చిందా?. బాధ్యతాయుత పదవుల్లో ఉంటూ న్యాయస్థానాలపై బురదచల్లుతురా?. కవిత బెయిల్‌ విషయంలో కావాలనే బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తో​ంది. కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?. నువ్వు కొట్టినట్లు చేయ్.. నేను ఏడ్చినట్లు చేస్తానన్నట్లుంది కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని, అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. కవితకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది న్యాయ స్థానం పరిధిలోని అంశం.

సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాళేశ్వరం సహా అనేక అంశాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్‌లను జైలుకు పంపాలి. కేసీఆర్ కుటుంబ ఆస్తులను జప్తు చేయాలి. లేనిపక్షంలో దాగుడుమూతలాడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గుణ పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ కామెంట్స్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement