హుస్నాబాద్ : ప్రజల అభిప్రాయాలను గుర్తించకుండా తీసుకున్న సబ్‌కమిటీ నిర్ణయాలు హుస్నాబాద్‌ను ధ్వంసం చేసేలా ఉన్నాయని అఖిలపక్షం నాయకులు అన్నారు. హుస్నాబాద్‌ను సిద్దిపేటలో కలపాలని ప్రతిపాదించడాన్ని నిరసిస్తూ శనివారం పట్టణంలో అఖిలపక్ష నాయకులు దున్నపోతుతో నిరసన తెలిపారు.
హుస్నాబాద్‌ను ధ్వంసం చేసే కుట్ర
Published Sat, Aug 13 2016 10:08 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM
హుస్నాబాద్ : ప్రజల అభిప్రాయాలను గుర్తించకుండా తీసుకున్న సబ్‌కమిటీ నిర్ణయాలు హుస్నాబాద్‌ను ధ్వంసం చేసేలా ఉన్నాయని అఖిలపక్షం నాయకులు అన్నారు. హుస్నాబాద్‌ను సిద్దిపేటలో కలపాలని ప్రతిపాదించడాన్ని నిరసిస్తూ శనివారం పట్టణంలో అఖిలపక్ష నాయకులు దున్నపోతుతో నిరసన తెలిపారు. వారు మట్లాడుతూ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. స్థానికేతురులైన ఎమ్మెల్యే, ఎంపీ స్థానికుల మనోభావాలను గౌరవించడం లేదన్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, సింగిల్‌విండో అధ్యక్షుడు బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, సింగిల్‌విండో డైరెక్టర్ అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గడిపె మల్లేశ్, కాంగ్రెస్ నాయకులు చిత్తారి రవీందర్, ఎండీ హస్సేన్, అయిలేని శంకర్‌రెడ్డి, బొల్లి శ్రీనివాస్, అక్కు శ్రీనివాస్, రాజిరెడ్డి, బీజేపీ నాయకులు కొత్తపల్లి అశోక్, టీడీపీ నాయకులు వరయోగుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement