
'9 రోజులు విమర్శలు చేయను'
కొందరు రాజకీయ విమర్శలు చేస్తున్నారు కానీ.. బతుకమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజులు తాను రాజకీయ విమర్శలు చేయనని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.
హుస్నాబాద్‌రూరల్: కొందరు రాజకీయ విమర్శలు చేస్తున్నారు కానీ.. బతుకమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజులు తాను రాజకీయ విమర్శలు చేయనని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం రాత్రి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లోని బస్‌డిపో గ్రౌండ్‌లో బంగారు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ ఆశా కార్యకర్తల సమస్యలను కేంద్ర ప్రభుత్వం తీర్చాల్సి ఉందన్నారు. తాను కూడా ఆశా కార్యకర్తల సమస్యలు తీర్చాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానన్నారు. ఆశా కార్యకర్తలు సమ్మె విరమించి తమతోపాటు సంబరాల్లో పాల్గొనాలని కోరారు. దేశంలో ఆడపిల్లలు వందకు వంద శాతం చదువుకున్న రాష్ట్రంగా తెలంగాణ ఉండాలన్నారు.