- హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి
- ఎమ్మెల్యే సతీష్‌కుమార్ దిష్టిబొమ్మ దహనం
టీఆర్‌ఎస్ నాయకులను గృహ నిర్బంధిస్తాం
Published Sun, Aug 28 2016 11:14 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
హుస్నాబాద్ : హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్‌లో కొనసాగించకపోతే టీఆర్‌ఎస్ నాయకులను గృహ నిర్బంధిస్తామని హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్, డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి హెచ్చరించారు. హుస్నాబాద్‌ను సిద్దిపేటలో కలపడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ దిష్టిబొమ్మను ఆదివారం దహనం చేశారు. కరీంనగర్‌లో కొనసాగించాలని గ్రామసభల ద్వారా తీర్మానాలు చేసిన ఎవరి స్వార్థం కోసం సిద్దిపేటలో కలుపుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం మెుండి వైఖరి వీడనాడకుంటే టీఆర్‌ఎస్ నేతల ఇళ్ల ఎదుట చావుదప్పులు మోగిస్తామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మేకల వీరన్న, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, సీపీఐ మండల కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్, సింగిల్‌విండో డైరెక్టర్ అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చిత్తారి రవీందర్, అయిలేని శంకర్‌రెడ్డి, లింగంపల్లి మల్లారెడ్డి, అక్కు శ్రీనివాస్, పచ్చిమట్ల రవీందర్, కేడం కనకయ్య, బీజేపీ నాయకులు వేముల ప్రభాకర్‌రెడ్డి, వేముల దేవేందర్‌రెడ్డి, చిట్టి గోపాల్‌రెడ్డి, పెరుమాండ్ల శేఖర్, టీడీపీ నాయకులు ముప్పిడి రాజిరెడ్డి తదితరులున్నారు.
స్వార్థ రాజకీయాల కోసమే..
–బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి
స్వార్థ రాజకీయాల కోసమే హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్దిపేటలో కలుపుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కొనసాగించాలని అఖిలపక్షం చేపట్టిన రిలే నిరహార దీక్ష శిబిరాన్ని ఆదివారం సందర్శించి సంఘీభావం తెలిపారు. అభివృద్ధి చేయలేని ఎమ్మెల్యే సిద్దిపేటలో కలిపేందుకు అంగీకరించడం సిగ్గుచేటన్నారు. సైదాపూర్‌ను హన్మకొండ జిల్లాలో కలపాలని అక్కడి గ్రామాలు తీర్మానాలు చేయడం వెనుక ఎమ్మెల్యే కుట్ర దాగి ఉందన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దీక్షలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పెందోట అనిల్‌కుమార్, గుత్తికొండ విద్యాసాగర్, అన్నబోయిన ప్రశాంత్, వరయోగుల అనంతస్వామి, జున్నోజు శ్రీకాంత్, భీమేశ్వర్, చందు, బోనగిరి రవి, ప్రదీప్ కూర్చున్నారు.
Advertisement