
2019 ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో నూ పోటీ
వచ్చే మార్చి నాటికి జనసేన పార్టీ పూర్తి స్థాయి రాజకీయ పార్టీ గా అవతరిస్తుందని, 2019 ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో నూ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
జనసేన పార్టీపై పవన్ కల్యాణ్
సాక్షి, అమరావతి: వచ్చే మార్చి నాటికి జనసేన పార్టీ పూర్తి స్థాయి రాజకీయ పార్టీ గా అవతరిస్తుందని, 2019 ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో నూ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ ఏర్పాటు చేసి మూడేళ్లయిన సందర్భంగా ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరు లతో మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో చంద్ర బాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని భావిం చానని, అయితే అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కార్యక్రమాలు ప్రజలకు సరిగా చేరువ కావడం లేదని అభిప్రాయపడ్డారు. తాను ఏపీ నుంచే పోటీ చేస్తా నని, అనంతపురం జిల్లా నుంచి పోటీ చేసేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. జనసేన ఇప్పుడు ఎన్డీయే భాగస్వామి పక్షం కాదని చెప్పారు. పార్టీ నిర్మాణం పూర్తయ్యాకే పొత్తుల గురించి ఆలోచిస్తామన్నారు.
అన్నయ్యదీ నాదీ వేర్వేరు దారులు
చిరంజీవి, తాను ఒకే పార్టీలో కలసి పనిచేసే ఆలోచన లేదని పవన్‌కల్యాణ్ చెప్పారు. పార్టీ ఆవిర్భావ దినో త్సవం సందర్భంగా జనసేన పార్టీ ప్రత్యేక పోర్టల్ ఏర్పాటుచేశామని.. భూ సమీకరణ, మైనింగ్ తదితర 39 అంశాలపై ప్రజలు, మేధావులు, విద్యార్ధుల నుం చి పార్టీకి సలహాలు, సూచనలు ఇవొచ్చన్నారు. ప్రజా రాజ్యం పార్టీలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఇతర పార్టీ నాయకులను తమ పార్టీలో చేర్చుకునే అంశంపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. మణిపూర్‌లో ప్రజల తరుఫున పోరాడిన ఇరోం షర్మిలకు ఎన్నికల్లో 90 ఓట్లు రావడం బాధించిందన్నారు.