సంబంధంలేని విషయాల్లో తనను లాగి.. తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక అసలు సూత్రధారి.. నిజమైన అజ్ఞాతవాసి టీవీ9 చానెల్ సీఈవో రవిప్రకాశ్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ సందర్భంగా టీవీ9 యజమాని శ్రీనిరాజుపై పవన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ రాజకీయ బాసులతో కుమ్మక్కై.. టీవీ9 చానెల్ ఈ వ్యవహారాన్ని నడిపిందని మండిపడ్డారు. టీవీ9 సీఈవో రవిప్రకాశ్ మార్గదర్శకత్వంలో తన తల్లిని బూతులు పదేపదే తిట్టించారని, శ్రీసిటీలో వాటాల కోసం రాజకీయ బాసులతో కుమ్మక్కై.. రవిప్రకాశ్ ఈ చర్యకు ఒడిగట్టాడని నిప్పులు చెరిగారు. ఇప్పుడు చేసిందంతా చేసి.. లీగల్ నోటీసులు పంపించడమేమిటని శ్రీనిరాజును పవన్ తప్పుబట్టారు. తన తల్లిని తిట్టించిన డ్రీమ్‌టీమ్‌లో లాయర్లు భాగం కాదంటూ.. శ్రీనిరాజు పంపిన లీగల్ నోటీసుల ప్రతిని పవన్ ట్వీట్ చేశారు.