
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తన నివాసాన్ని హైదరాబాద నుంచి విజయవాడకు మార్చారు.
సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తన నివాసాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చారు. విజయవాడలోని పడమటలో అద్దె ఇల్లు తీసుకున్న పవన్ శుక్రవారం గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ దంపతులు కొత్త ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. ఇక నుంచి విజయవాడ కేంద్రంగానే పార్టీ కార్యకలాపాలు జరుగనున్నాయి.
ఇంట్లోనే పార్టీ సమావేశాలు, మీడియా సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మరో వైపు పవన్ నాగార్జున వర్శిటీ సమీపంలోని కాజ గ్రామంలో సొంత ఇంటిని, కార్యాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి పనులు ఆలస్యంమవుతుండటంతో అద్దె ఇల్లు తీసుకోవాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.