
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీ అవ్వనున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో బరిలో దిగుతానని పవన్ ఇప్పటికే చాలా సార్లు ప్రకటించాడు. దీంతో పవన్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాడన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. అంతేకాదు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమానే పవన్ చివరి సినిమా అన్న టాక్ వినిపిస్తోంది. ఏ ఎం రత్నం, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి సంస్థలు పవన్ సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. పవర్ స్టార్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో పవన్ సినీ భవిష్యత్తుపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా తరువాత పవన్ పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టనున్నాడట. అయితే 2019 ఎన్నికల తరువాతే తన సినీ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆశించినట్టుగా రాజకీయాల్లో సత్తా చాటలేకపోతే తిరిగి సినిమాల మీదే పవన్ దృష్టి పెడతారన్న టాక్ వినిపిస్తోంది. రెండేళ్ల విరామం తరువాత తిరిగి పవన్ సినిమాల్లో నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.