'పవన్ ఇజం' మోడీ ఇజంలా ఉంది | B. V. Raghavulu comments on jana sena party | Sakshi
Sakshi News home page

'పవన్ ఇజం' మోడీ ఇజంలా ఉంది

Published Fri, Mar 28 2014 9:07 AM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

'పవన్ ఇజం' మోడీ ఇజంలా ఉంది - Sakshi

'పవన్ ఇజం' మోడీ ఇజంలా ఉంది

ఎన్నికలు నేపథ్యంలో రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన విజయవాడ నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పవన్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రజల కోసం వస్తుందనుకుంటే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానిని చేసేందుకు వచ్చినట్లు ఉందని ఆయన ఆరోపించారు. పవన్ ఇజం ప్రజల కోసం ఉంటుందనుకోంటే అది మోడీ ఇజంలా ఉందంటూ రాఘవులు ఎద్దేవా చేశారు.

 

రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దాంతో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. తెలంగాణలో కూడా పలు పార్టీల నాయకులు ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ అంటు గెంతుతున్నారు.ఈ నేపథ్యంలో రాఘవులు పై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement