B. V. Raghavulu
-
తిరుపతి లడ్డూ వివాదం.. పవన్‌కు చురకలు
విజయవాడ, సాక్షి: భక్తుల మనోభావాల్ని దెబ్బ తీసే ఏ చర్యను.. ఏ రాజకీయ పార్టీ కూడా ఒప్పుకోదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. సీతారాం ఏచూరి సంస్కరణ సభలో తిరుపతి లడ్డు వివాదంపై స్పందించిన ఆయన.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కూ చురకలంటించారు.‘‘ఏపీలో లడ్డు గొడవ నడుస్తోంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఏచర్యను ఏ రాజకీయ పార్టీ ఒప్పుకోదు. కల్తీ నెయ్యి వాడినట్లు తెలిస్తే.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. దోషులను పట్టుకుని శిక్షించాలి. అంతేగానీ రాజకీయం చేయడం సరికాదు.సనాతన ధర్మం బోర్డు పెట్టాలని ఒక పెద్ద మనిషి అంటున్నాడు అసలు సనాతన ధర్మం అంటే ఏంటో ఆయన్ని చెప్పమనండి అంటూ పవన్‌కు పరోక్షంగా రాఘవులు చురకలు అంటించారు.తిరుమల లడ్డూ వివాదంపై ఎక్స్ ఖాతాలో పవన్ స్పందిస్తూ.. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మరక్షణ బోర్డు' ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని, దీనిపై అన్ని వర్గాల వారితో జాతీయస్థాయిలో చర్చ జరగాలని అన్నారు. ఇదీ చదవండి: లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు..: బీవీ రాఘవులు -
కార్పొరేట్ సాధనంగా ‘బడ్జెట్’
ఒంగోలు టౌన్: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చే సాధనంగా బడ్జెట్‌ను మార్చి వేసిందని సీపీఎం కేంద్ర కమిటీ నాయకుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల సంఘాల ఐక్యవేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక సీవీఎన్ రీడింగ్ రూం ఆవరణలో కేంద్ర బడ్జెట్, పెద్దనోట్ల రద్దు, మధ్య తరగతి ఉద్యోగుల ప్రభావంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి రాకముందు స్వయం ప్రతిపత్తి కలిగిన ప్లానింగ్ కమిషన్ కేంద్రానికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేదని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం దాని స్థానంలో నీతి అయోగ్‌ను ప్రవేశపెట్టిందని విమర్శించారు. రానున్న రెండున్నరేళ్ల ఏళ్లలో రైల్వే రంగాన్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి తిని వేసేందుకు కేంద్రం కుట్ర పన్నిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా జీఎస్టీని ప్రవేశపెట్టి ఒకే తరహా ధర, పన్ను అమలులోకి తీసుకు వచ్చిందన్నారు. దీంతో చిన్న చిన్న వ్యాపారాలు, పరిశ్రమలకు నష్టం కలిగి సామాన్య ప్రజలపై పన్నుల భారం పడిందన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని ఇక్కడకు రప్పిస్తే ఒక్కో కుటుంబానికి రూ.15లక్షలు ఇస్తానంటూ ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చి, ఇప్పుడు నల్ల కుబేరుల పేర్లు బయట పెట్టడానికి కూడా భయపడుతున్నారన్నారు. రూ.16లక్షల కోట్ల నోట్ల రద్దు చేశారని, వాటి స్థానంలో రూ.16లక్షల 50వేల కోట్లు ముద్రించారని, అంటే నల్లడబ్బు పోకపోగా అదనంగా రూ.50వేల కోట్లు వచ్చి పడ్డాయన్నారు. నోట్ల రద్దు కారణంగా ఆర్థిక వ్యవస్థ 7.8శాతం నుంచి 7.1శాతానికి పడిపోయిందని ఎద్దేవా చేశారు. చట్టసభల్లో మాది అరణ్య ఘోషే – మాజీ ఎమ్మెల్సీ విఠపు చట్టసభల్లో మాది అరణ్య ఘోషేనని మాజీ శాసనమండలి సభ్యుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఉద్యోగ వర్గాలపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 474సంక్షేమ వసతి గృహాలను ఎత్తివేసిందని, మరో 310వసతి గృహాలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నోట్ల రద్దు వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో పాటూ నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. సదస్సులో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కార్పొరేట్ శక్తుల తొత్తులుగా పాలకులు
పేదల జీవితాలు బాగుచేయండి సీపీఎం నేత బీవీ రాఘవులు విజయవాడ సబ్‌కలెక్టరేట్ వద్ద ధర్నా విజయవాడ : పాలకులు కార్పొరేట్ శక్తులకు తొత్తులుగా మారారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ధ్వజమెత్తారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీపీఎం దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆ పార్టీ కృష్ణాజిల్లా విభాగం శ్రేణులు బుధవారం నగరంలోని సబ్-కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని విమర్శించారు. పేదలు, కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. విదేశీ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందన్నా రు. ్రపధాని మోదీ ఆహ్వానిస్తున్న విదేశీ కంపెనీలు భవిష్యత్‌లో దేశాన్ని కొల్లగొట్టే ప్రమాదం ముంచుకొస్తోందన్నారు. విదే శీ యంత్రాలు, యంత్ర యజమానులకు వేలకోట్లు ధారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తోందన్నా రు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో రాజధాని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారన్నారు. చంద్రబాబు ఆర్నెల్ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయని రాఘవులు విమర్శించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎన్ఆర్ఈజీ ఎస్ పథకాన్ని కుదించవద్దని, ప్రభుత్వరంగం సంస్థలను ప్రైవేటు పరం చేయవద్దని మంత్రిమండలిలో తీర్మానం చేసి పార్లమెంటు సమావేశాలకు పంపాలని రాఘవులు సూచించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పిన్నమనేని మురళీ కృష్ణ మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. పేదల పక్షాన సీపీఎం పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. ఆందోళన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు యు.ఉమామహేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్.రఘు, నగర కార్యదర్శి సిహెచ్ బాబూరావు, రైతు సంఘం కార్యదర్శి వై.కేశవరావు తదితరులు పాల్గొన్నారు. -
'పవన్ ఇజం' మోడీ ఇజంలా ఉంది
ఎన్నికలు నేపథ్యంలో రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన విజయవాడ నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పవన్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రజల కోసం వస్తుందనుకుంటే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానిని చేసేందుకు వచ్చినట్లు ఉందని ఆయన ఆరోపించారు. పవన్ ఇజం ప్రజల కోసం ఉంటుందనుకోంటే అది మోడీ ఇజంలా ఉందంటూ రాఘవులు ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దాంతో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. తెలంగాణలో కూడా పలు పార్టీల నాయకులు ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ అంటు గెంతుతున్నారు.ఈ నేపథ్యంలో రాఘవులు పై విధంగా స్పందించారు. -
కాంగ్రెస్, బీజేపీ రెండూ...మోసపూరిత పార్టీలే
పాల్వంచ, న్యూస్‌లైన్: దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో అవినీతికి అంతులేకుండా పోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు విమర్శించారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ సమానమేనని అన్నారు. పాల్వంచలో ఆదివారం జరిగిన ‘వర్తమాన రాజకీయాలు- సీపీఎం వైఖరి’ అనే సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగినప్పటికీ, వచ్చే ఎన్నికల్లో మాత్రం తృతీయ కూటమికే ప్రజలు పట్టం కట్టడం ఖాయమని చెప్పారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీ అధికారంలోకి వస్తే దేశం అథోగతి పాలవుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్, నీటి చార్జీలను భారీగా పెరిగాయని, బీజేపీ గెలిచినా ఇదే పరిస్థితి ఉంటుందని అన్నారు. 2014 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై మూడవ శక్తిగా ఏర్పడుతాయని, ఆ కూటమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తృతీయ కూటమి కోసం సీపీఎం, మిగితా వామపక్ష పార్టీలు ఎప్పటినుంచో కృషి చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో 19 శాతం ఆహార ధరలు పెరిగాయని విమర్శించారు. ఢిల్లీలో ఉల్లిపాయల ధరల పోస్టర్లను చూపి ఓట్లను కొల్లగొట్టారని అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏమాత్రం మెరుగు పడలేదని, ఆర్థిక పరిస్థితి పెరగకపోగా 5 శాతం వృద్ధిరేటు తగ్గిందని అన్నారు.రాష్ట్రంలో గత రెండేళ్లుగా జలయజ్ఞం పనులు నిలిచిపోయాయని, దీంతో పంటల ఉత్పత్తి పడిపోయిందని, తద్వారా రైతులతో పాటు పలు పరిశ్రమలకు కూడా నష్టం వాటిల్లుతోందని చెప్పారు. సమైక్య నినాదంతో నిలబడింది సిపిఎం ఒక్కటే... సీపీఎం ఒక్కటే మొదటి నుంచీ సమైక్య నినాదానికి కట్టుబడి ఉందని రాఘవులు చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీలు అవకాశవాదంతో వ్యవహరించాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇంతకాలం మాట్లాడకుండా ఇప్పుడు సమైక్య నినాదం అందుకున్నాడ ని, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీలో చేరుతాడో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం కలసి ఉంటేనే కష్టాలను సులభంగా ఎదుర్కోవచ్చన్నారు. రెండుప్రాంతాలుగా విడిపోయినా దోచుకునే వారే తప్ప మిగిలిన వర్గాలు ముందుకెళ్లే పరిస్థితి ఉండదని అన్నా రు. ప్రత్యేక, సమైక్య ఉద్యమాలతో రెండు ప్రాంతాలు వెనుకబడిపోయాయని, పెట్టుబడి పెట్టే కంపెనీలన్నీ బెంగుళూరు, మద్రాస్ వంటి నగరాలకు వెళ్లిపోయాయని చెప్పారు. సీఎస్ఆర్ పాలసీ అమలులో జెన్కో నిర్లక్ష్యం... సీఎస్ఆర్ పాలసినీ అమలు చేయడంలో జెన్కో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాఘవులు విమర్శించారు. ఇక్కడి కర్మాగారాలతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడం లేదని ఆరోపించారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. సదస్సులో పార్టీ నాయకులు కాసాని అయిలయ్య, అన్నవరపు సత్యనారాయణ, జ్యోతి, ఇట్టి వెంకటరావు, కొండపల్లి శ్రీధర్, దొడ్డా రవికుమార్, సీఐటీయూ నాయకులు కిరణ్ పాల్గొన్నారు. ఆదర్శవంతమైన జీవితం గడపాలి భద్రాచలం, న్యూస్‌లైన్: నూతన దంపతులు ఆదర్శవంతమైన జీవితం గడపాలని బి.వి. రాఘవులు ఆకాంక్షించారు.భద్రాచలానికి చెందిన సీపీఎం నేత బండారు రవికుమార్ కుమార్తె శాంతిచంద్ర వివాహం ఆదివారం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాఘవులు నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేటి రోజుల్లో వివాహాలు ఆడంబరాలకు చిహ్నాలుగా మారిపోతున్నాయని, వీటికి దూరంగా ఉండాలని అన్నారు. వధూవరులు సంసార జీవితంలో ఒడిదుడుకులను అధిగమించి ముందుకు సాగాలని సూచించారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు, మాజీ ఎమ్మెల్యేలు తమ్మినేని వీరభద్రం, సున్నం రాజయ్య, జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, వైఎస్సార్సీపీ కొత్తగూడెం నియోజకవర్గ సమన్వయకర్త ఎడవల్లి కృష్ణ, డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు తదితరులు వధూవరులను ఆశీర్వదించారు.