ఘటనా స్థలిలో మృతి చెందిన రామకృష్ణ
సాక్షి, తిరువూరు : కుమారుడి అన్న ప్రాసన శుభకార్యానికి రావాల్సిందిగా పిలుపులకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ కల్వర్టులో పడి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. రహదారిపై ఆరు నెలల క్రితం ధ్వంసమైన కల్వర్టును పునర్నిర్మించడంలో తిరువూరు నగర పంచాయతీ ప్రదర్శించిన నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. పీటీ కొత్తూరు నుంచి తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్లే రహదారిని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసిన అధికారులు కల్వర్టు నిర్మాణం చేయలేదు.
బలహీనంగా ఉన్న కల్వర్టు నిర్మించకపోవడంతో గానుగపాడుకు చెందిన యువకుడు బట్ట రామకృష్ణ (26) బైక్‌పై వెళ్తూ ప్రమాదవశాత్తూ ఆ గోతిలో పడి మృతి చెందాడు. కుమారుడి అన్న ప్రాసన మరో రెండు రోజుల్లో జరపడానికి బం ధుమిత్రులను పి లిచేందుకు వెళ్లిన భర్త కానరాని లోకాలకు చేరడంతో అతని భార్య విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడి కుటుంబాన్ని స్థానిక సామాజిక ఆస్పత్రిలో ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి పరామర్శించి ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment