Delhi Police Raids To Trace Wrestler Sushil Kumar In Chhatrasal Stadium Murder Case - Sakshi
Sakshi News home page

Sushil Kumar: పరారీలో ఇండియన్‌ స్టార్​ రెజ్లర్ సుశీల్ కుమార్?!

Published Thu, May 6 2021 10:49 AM | Last Updated on Thu, May 6 2021 3:08 PM

Fir Filed Against Wrestler Sushil Kumar In Chhatrasal Stadium Murder Case - Sakshi

న్యూఢిల్లీ :  ఢిల్లీలో దారుణం దారుణ హత్య జరిగింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 24 ఏళ్ల రెజ్లర్‌ మరణించారు. అయితే బాధితుడి మృతిలో ఇండియన్‌ స్టార్​ రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గురిక్బాల్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. ''మోడల్ టౌన్ ప్రాంతానికి చెందిన ఛత్రపాల్ స్టేడియం సమీపంలో ఇండియన్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు చెందిన ఇంట్లో సాగర్, అమిత్‌ కుమార్‌, ప్రిన్స్‌ దలాల్‌ ఉంటున్నారు. ఇల్లు ఖాళీ చేసే విషయమై,  ఇరువర్గాల మధ్య సుమారు 4 గంటల పాటు ఘర్షణ జరిగినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. 

ఈ క్రమంలో, తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఛత్రసల్ స్టేడియం సమీపంలో ఇద్దరు వ్యక్తులు తుపాకీతో ఇతరులపై కాల్పులు జరిపినట్లు  పోలీస్‌ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. దీంతో ఘటనస్థలానికి చేరుకున్న మోడల్‌ స్టేషన్‌ పోలీసులు ఘటనా స్థలంలో సాగర్‌ కుమార్‌ విగత జీవిగా పడి ఉన్నాడు. అతడిని ఢిల్లీ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కుమారుడిగా గుర్తించారు. ఇక ఈ ఘటనలో సోను మహల్ (35), అమిత్ కుమార్ (27) గాయపడ్డారు. ఈ క్రమంలో ప్రిన్స్‌ దలాల్ (24) అనే యువకుడిని అరెస్ట్‌ చేసి.. పార్క్‌ చేసిన ఓ వాహనంలో బుల్లెట్లు లోడ్‌ చేసిన గన్‌ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 

సుశీల్‌ కుమార్‌ పై ఎఫ్‌ఐఆర్‌ 
ఈ ఘటనలో సుశీల్‌ కుమార్‌ హస్తం ఉందని తేలడంతో అతనిపై ఎఫైఆర్‌ నమోదైందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గురిక్బాల్ సింగ్ సిద్ధూ చెప్పారు. కేసు దర్యాప్తు భాగంగా సుశీల్‌ కుమార్‌ కోసం వాళ్ల ఇంట్లో సోదాలు చేశాం. అక్కడ సుశీల్‌ కుమార్‌ లేడు.  పోలీసులు బృందాలుగా విడిపోయి సుశీల్‌ కుమార్‌ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.

చదవండి: Wrestler Sushil Kumar: సుశీల్‌కు మొండిచేయి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement