ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కరోనా మహమ్మారి పోరులో అవిశ్రాంతంగా పని చేస్తున్న ముంబై పోలీసులకు ఫిట్‌నెస్-హెల్త్ ట్రాకింగ్ పరికరాలు అందజేశారు. కరోనా పరిస్థితుల్లో అవి పోలీసుల శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయి, హృందయ స్పందనలును తెలియజేస్తుంది. పోలీసులకు ఈ పరికరాలు చాలా ఉపయోగపడతాయి. శనివారం ఆయన ముంబై పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్‌కు ఫిట్‌నెస్ హెల్త్ ట్రాకింగ్ పరికారాలు అందజేశారు. అక్షయ్ పోలీసులకు చేసిన సాయంపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ట్విటర్‌లో స్పందించారు. ‘ముంబై పోలీసులకు అక్షయ్‌జీ ఫిట్‌నెస్-హెల్త్ ట్రాకింగ్ పరికరాలు అందజేశారు. కరోనాతో నివారణలో యుద్ధం చేస్తున్న పోలీసులకు ఈ పరికరాలు వారి శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయి, హృదయ స్పందనలను తెలియజేయడంలో ఉపయోగపడతాయి. ఫిట్‌నెస్- హెల్త్ ట్రాకింగ్ పరికరాలను గత నెలలో నాసిక్ పోలీసులకు కూడా అందించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని పోలీసులకు అండగా ఉంటున్నారు. దేశంలోని సాయుధ దళాలు, కరోనా కట్టడిలో పోరాడుతున్న పోలీసులపై ఆయనకున్న గొప్ప మనసుకు కృతజ్ఞతలు’ అని అదిత్య ఠాక్రే పేర్కొన్నారు.
Earlier today, @akshaykumar ji handed over fitness- health tracking devices to @MumbaiPolice . It gives a constant reading of oxygen, body temp and heart rate, helpful in Covid battle. Last month, Akshay ji gave it to @nashikpolice . (1/n) pic.twitter.com/rgWh2LfbIW
— Aaditya Thackeray (@AUThackeray) August 1, 2020
అదే విధంగా ఈ ట్రాకర్లను బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌కు ఇవ్వడంపై చర్చిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 56 మంది పోలీసులు కరోనా పాజిటికు గురైనట్లు ఓ అధికారి తెలిపారు. కరోనాపై పోరులో కృషి చేస్తున్న ముంబై పోలీస్ ఫౌండేషన్‌కు అక్షయ్ తన వంతు సాయంగా రూ.2 కోట్లు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment