
అశోక్ చవాన్,ఆదిత్య ఠాక్రే
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 51 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ పేర్లను ఖరారు చేసింది. అభ్యర్థుల్లో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ భికర్ స్థానం నుంచి, పార్టీ రాష్ట్ర చీఫ్ విజయ్ బాలసాహెబ్ థోరాట్ సంగమ్నెర్ నుంచి పోటీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు అమిత్ లాతూర్ సిటీ నుంచి, మాజీ హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే కూతురు ప్రణితి సోలాపూర్ సిటీ సెంట్రల్ నుంచి పోటీ చేయనున్నారు. పార్టీ సీనియర్‌నేత నితిన్ రౌత్ నాగ్‌పూర్ నార్త్ నుంచి పోటీ చేయనున్నారు. అక్టోబర్ 21న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
వర్లి నుంచి ఆదిత్య ఠాక్రే
ముంబై: శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. ముంబైలోని వర్లి స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఠాక్రే కుటుంబం తరఫున ఓ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం.
Comments
Please login to add a commentAdd a comment