ముంబై: మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ శిండే–దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై శివసేన నేత, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే సోమవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అసలు ముఖ్యమంత్రి ఎవరో అర్థం కావడం లేదని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సోమవారం మాతోశ్రీ వద్ద పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఠాక్రే మాట్లాడుతూ, తిరుగుబాటు ఎమ్మెల్యేలపై శివసేన సుప్రీంకోర్టులో పోరాడుతోందని, సుప్రీం ఇచ్చే తీర్పు పార్టీపైనే కాకుండా మొత్తం దేశంపై కూడా ప్రభావం చూపుతుందని అన్నారు.
‘రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వం ఉందా లేదా అన్నది అసలు ప్రశ్న. ఇద్దరే ఇద్దరు వ్యక్తుల జంబో క్యాబినెట్‌లో, అసలు ముఖ్యమంత్రి ఎవరో అర్థం చేసుకావడం లేదు’ అని ఠాక్రే అన్నారు. యాదృచ్ఛికంగా, జూన్ 30న షిండే, ఫడ్నవీస్‌లు సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల తర్వాత మంగళవారం మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. శిండేతోపాటు 39 మంది సేన ఎమ్మెల్యేల తిరుగుబాటు తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం జూన్ 29న పడిపోయిన విషయం తెలిసిందే.
చదవండి: కొలువుదీరిన మహారాష్ట్ర కేబినెట్.. 18 మంది మంత్రులు వీరే
Comments
Please login to add a commentAdd a comment