ముంబై: మహారాష్ట్రలో ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై శివసేన(ఉద్దవ్ వర్గం) అధినేత ఉద్దవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరైనా సరే శివసేన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎంవీయే భాగస్వామ్యాలైన కాంగ్రెస్, ఎన్సీపీ శరద్‌పవార్ ప్రకటించిన అభ్యర్ధికి భేషరతుగా మద్దతిస్తామన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర అత్మగౌరవాన్ని కాపాడే పోరాటమని పేర్కొన్నారు.
‘ఎంవీఏ కూటమిలో సీఎం అభ్యర్థిపై ఊహాగానాలు ఉన్నాయి. పృథ్వీరాజ్ చవాన్ అయినా, శరద్ పవార్ అయినా సరే, కూటమిలోని నేతలందరూ తాము సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారో వారి పేర్లను ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వారి నిర్ణయానికి నేను పూర్తి మద్దతు ఇస్తాను’ అని తెలిపారు.
అదే విధంగా ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే ప్రచారం ప్రారంభించాలని ఎంవీఏ భాగస్వాములను ఆయన కోరారు. 'ఎవరు ఎక్కువ సీట్లు గెలిస్తే వారికే సీఎం పదవి దక్కుతుందనే నిబంధనను మేం పాటించాం. ఇంతకుముందు పొత్తుల్లో కూడా ఇదే ఫార్ములాను అనుసరించాం. కాబట్టి ముందుగా సీఎం ముఖాన్ని ప్రకటించాలని, ఆ తర్వాతే ప్రచారాన్ని ప్రారంభించగలమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రత్యర్థి శివసేన వర్గానికి పార్టీ గుర్తు వెళ్లిపోవడంపై స్పందిస్తూ.. వాల్లు నా'విల్లు-బాణం' గుర్తును దొంగిలించినప్పటికీ, నేను వారి వెన్నుముకకు నిప్పు పెట్టడానికి 'లైటింగ్ టార్చ్'ని గుర్తుగా ఎంచుకున్నాను’ అని చెప్పారు..
కాగా 2022లో శివసేనను చీల్చుతూ ఏక్‌నాథ్ షిండే.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే షిండే వర్గానికి అత్యధిక ఎమ్మెల్యేల బలం ఉండటంతో గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం 'శివసేన' పార్టీ పేరును, దాని విల్లు, బాణం గుర్తును కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment