ముంబై: రాజకీయ సంక్షోభ ఎపిసోడ్‌ను ప్రజల మది నుంచి తుడిచేసేందుకు.. పాలనా పరమైన సంస్కరణలను తెరపైకి తీసుకొస్తున్నారు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే. అయితే శివ సేన అధినేత, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే మాత్రం.. రెబల్ ఎమ్మెల్యేలపై విమర్శలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా థాక్రే చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు సీఎం షిండే.
‘‘అసెంబ్లీలో బలపరీక్షలో గెలిచాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీతో కలిసి ఘన విజయం సాధిస్తాం. రెబల్స్ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా గెలవరని కొందరు అంటున్నారు. కానీ, నేను చెప్తున్నా.. అందరికి అందరూ గెలుస్తారు. దానికి నాది బాధ్యత. వీళ్లలో ఏ ఒక్కరూ ఓడినాసరే.. నేను రాజకీయ సన్యాసం చేస్తా. అసలు ఓడిపోతారని.. గెలుస్తారని చెప్పడానికి నువ్వెవరు? అదంతా ప్రజలు.. ఓటర్లే నిర్ణయించేది’’.. అంటూ పరోక్షంగా ఉద్దవ్ థాక్రేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రెబల్స్ శివసేన ఎమ్మెల్యేల్లో నలభై మంది ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవరని, కావాలంటే ఛాలెంజ్‌కు సిద్ధమని శివసేన పార్టీ అధినేత ఉద్దవ్‌థాక్రే వ్యాఖ్యానించారు. దీంతో థాక్రే పేరెత్తకుండానే.. శుక్రవారం సాయంత్రం రెబల్ ఎమ్మెల్యే సంజయ్ షిర్‌సత్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సీఎం షిండే పైవ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment