
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తును మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టను ఆశ్రయించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకోకుండానే ఈసీ నిర్ణయం తీసుకుందని, శివసేన మెజారిటీ కార్యకర్తలు తమవెంటే ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను వీలనైంత త్వరగా విచారించాలని థాక్రే తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ అత్యున్నత స్థానాన్ని అభ్యర్థించారు. అయితే న్యాయస్థానం మాత్రం ఈ పిటిషన్ ఇవాల్టి లిస్టింగ్‌లో లేదని మంగళవారం సరైన ప్రక్రియతో రావాలని సూచించింది.
అయితే సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా సుప్రీంకోర్టును ముందుగానే ఆశ్రయించారు. శివసేన గుర్తు కేటాయింపుపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని థాక్రే సవాల్ చేయవచ్చని, దీనిపై ఆదేశాలు ఇచ్చే ముందు మహారాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయన్ని తీసుకోవాలని కోరారు.
చదవండి: శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం రూ.2,000 కోట్ల డీల్: సంజయ్ రౌత్
Comments
Please login to add a commentAdd a comment