ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుటుంబసభ్యులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ముంబై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించామని గురువారం బాంబే హైకోర్టుకు ముంబై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు తెలిపారు.
మరోవైపు, ఉద్ధవ్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలంటూ బాంబే హైకోర్టులో మహిళా పబ్లిషర్ గౌరి బిధే వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై తీర్పును డివిజన్ బెంచ్ రిజర్వ్ చేసింది.
చదవండి: (కొలీజియం మన దేశ చట్టం.. అందరూ అనుసరించాల్సిందే: సుప్రీంకోర్టు)
Comments
Please login to add a commentAdd a comment